మాస్కుల వితరణ

ABN , First Publish Date - 2021-05-17T04:45:43+05:30 IST

స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా బాధితులకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజ్‌లు, బెడ్‌షీట్లు, పండ్లు సూపరింటెండెంట్‌ ఎం.రమేష్‌కు ఆది వారం లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు తిరుపతి రావు, సభ్యుడు డాక్టర్‌ టి.బాలకృష్ణ అందజేశారు.

మాస్కుల వితరణ
పలాస: సూపరింటెండెంట్‌కు మాస్కులు అందిస్తున్న లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు

పలాస: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో  కరోనా బాధితులకు  మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజ్‌లు, బెడ్‌షీట్లు, పండ్లు సూపరింటెండెంట్‌ ఎం.రమేష్‌కు ఆది వారం లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు తిరుపతి రావు, సభ్యుడు డాక్టర్‌ టి.బాలకృష్ణ అందజేశారు. కార్యక్రమంలో అట్టాడ మాధవరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 


ఆటో కార్మికుని కుటుంబానికి ‘అభయం’ 

టెక్కలి: పట్టణంలోని బర్మా కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ జె.చిన్నారావు ఇటీవల కరోనాతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి అభయం యువ జన సేవా సంఘం, వర్తక, వైశ్య సంఘం ప్రతినిధులు రూ.20 వేల ఆర్థిక సాయం ఆదివారం అందించారు. కార్యక్రమంలో  దేవాది శ్రీనివాస్‌, లాడి కామే శ్వరరావు, వారణాసి గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఆదిఆంధ్రా వీధికి చెందిన చిట్టి వినయ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో నిరుపేదలైన తల్లి దండ్రులకు నిత్యావసర సరుకులను జనసేన నాయకుడు కూరాకుల యాదవ్‌ ఆదివారం అందించారు.

 

Updated Date - 2021-05-17T04:45:43+05:30 IST