టీటీడీ ఉద్యోగులకు హెల్త్‌ కార్డుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-28T06:44:59+05:30 IST

దేశం లోని 15 ప్రముఖ వైద్య శాలల్లో టీటీడీ ఉద్యోగు లు నగదు రహిత వైద్యం చేసుకునేలా ఒప్పం దాలను కుదుర్చుకున్నట్టు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

టీటీడీ ఉద్యోగులకు హెల్త్‌ కార్డుల పంపిణీ
స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మతో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న టీటీడీ ఛైర్మన్‌,ఈవో

తిరుపతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : దేశం లోని 15 ప్రముఖ వైద్య శాలల్లో  టీటీడీ ఉద్యోగు లు నగదు రహిత వైద్యం చేసుకునేలా ఒప్పం దాలను కుదుర్చుకున్నట్టు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ.25 కోట్లతో ఇందు కోసం ఆరోగ్య నిధిని ఏర్పాటు చేశామన్నారు. టీటీడీ  ఉద్యోగులకు గురువారం ఆయన హెల్త్‌ కార్డులను పంపిణీ చేశారు.మేయర్‌ శిరీష, పశు వైద్య విశ్వవిద్యాలయం వీసీ పద్మనాభరెడ్డి, ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ జానకిరాం, స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపీనాథ్‌, ఎస్వీ గోశాల డైరెక్టర్‌ హరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


త్వరలో పూర్తిస్థాయిలో శ్రీవారి దర్శనం : టీటీడీ ఛైర్మన్‌

 కొవిడ్‌కు ముందు శ్రీవారి సర్వ దర్శనానికి భక్తులను ఎలా అనుమతిస్తున్నామో, అలా అతి త్వరలోనే అనుమ తించనున్నట్టు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  ప్రకటించారు. తిరుపతిలో గురువారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ పూర్తయిన సందర్భంగా ఈ చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయని, వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే సీఎం కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకున్నారన్నారు. బాలాజీ జిల్లాతో పాటు అన్నమయ్య, సత్యసాయి, ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు పేర్లతో జిల్లాలు ఏర్పాటు చేయడంపై ప్రజలందరి తరపునా జగన్‌కు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.

Updated Date - 2022-01-28T06:44:59+05:30 IST