Abn logo
Jul 29 2021 @ 23:30PM

అంగన్‌వాడీ కేంద్రానికి ఫర్నీచర్‌ వితరణ

ఫర్నీచర్‌ను అందిస్తున్న దాల్మియా అధికారులు

మైలవరం, జూలై 29 : మండల పరిధిలోని చిన్నకొమెర్ల ఎస్సీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రానికి దాల్మియా అధికారులు పిల్లలకు అవసరమయ్యే ఫర్నీచర్‌ను గురువారం వితరణ చేసినట్లు ఐసీడీఎస్‌  సీడీపీవో ముంతాజ్‌ బేగం, మండల ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ గౌసియాబి తెలిపారు. పిల్లలకు అవసరమయ్యే కుర్చీలు, టీవీ, ప్లేట్లు, గ్లాసులు, తదితర వస్తువులను అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్ర మంలో దాల్మియా అధికారులు  రామరాజు, చార్లెస్‌ ఆల్విన్‌, సిబ్బంది శ్రీనివాసులు, రాజే్‌షకుమార్‌లు పాల్గొన్నారు.