మత్స్యకారుల జీవనోపాధికి చేపపిల్లల పంపిణీ

ABN , First Publish Date - 2021-10-19T04:22:44+05:30 IST

మత్స్యకారుల జీవనోపాధికి రాష్ట్ర ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని గజ్వేల్‌ ఏఎంసీ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ అన్నారు.

మత్స్యకారుల జీవనోపాధికి చేపపిల్లల పంపిణీ
మునిగడప చెరువులో చేపపిల్లలను వదులుతున్న దృశ్యం

గజ్వేల్‌ ఏఎంసీ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ 

జగదేవపూర్‌, అక్టోబరు 18 : మత్స్యకారుల జీవనోపాధికి రాష్ట్ర ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని గజ్వేల్‌ ఏఎంసీ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ అన్నారు. సోమవారం జగదేవపూర్‌ మండలంలోని మునిగడప పెద్ద చెరువు, తీగుల్‌, గొల్లపల్లి, ఇటిక్యాల, దర్మారం, పీర్లపల్లి గ్రామాల చెరువుల్లో 4.95 లక్షల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలు, కులవృత్తుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశంగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కవితారెడ్డి, సర్పంచులు బాల్‌లక్ష్మీఐలయ్యగౌడ్‌, భిక్షపతి, నాయకులు బాలయ్య, జితేందర్‌రెడ్డి, దర్శనం మల్లేశం, రవి, ఉపసర్పంచ్‌ లావణ్య మల్లేశం, ఉప్పలయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T04:22:44+05:30 IST