Abn logo
Apr 13 2021 @ 01:54AM

రంజాన్‌ మాసం సందర్భంగా నిత్యావసర సరుకుల పంపిణీ

ఖానాపూర్‌, ఏప్రిల్‌ 12 : పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం ఖానాపూర్‌లోని నిరుపేద ముస్లింలకు జామాతే ఇస్లామి హింద్‌ సంస్థ ఆద్వర్యంలో నిర్వహించిన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్‌ ప్రారంబించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంస్థ నిర్వాహాకులను ఎమ్మెల్యే అభినందించారు. 

మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే రేఖానాయక్‌ లబ్దీదారులకు సిఎంఆర్‌ఎప్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పెంబి మండలంలోని నాగాపూర్‌, మందపెల్లి గ్రామాలకు చెందిన పలువురికి సిఎంఆర్‌ఎప్‌ ద్వారా మంజూరి అయిన చెక్కులను వారి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, ఖానాపూర్‌, పెంబి మండలాల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు తాళ్ళపెల్లి రాజగంగన్న, పుప్పాల శంకర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు కొక్కుల ప్రదీప్‌, గొర్రె గంగాధర్‌, ద్యావతి రాజేశ్వర్‌, వోల్గుల వెంకటేష్‌, తదితరులున్నారు. 

Advertisement
Advertisement