పాఠశాలల్లో విద్యా కానుక కిట్ల పంపిణీ

ABN , First Publish Date - 2022-07-06T06:47:39+05:30 IST

స్థానిక ప్రాథమిక పాఠశాలను విద్యార్థులు అభివృద్ధి చేసుకోవాలని జడ్పీటీసీ సభ్యులు, చేదూరివిజయభాస్కర్‌ అన్నారు.

పాఠశాలల్లో విద్యా కానుక కిట్ల పంపిణీ
కిట్లు అందజేస్తున్న ఉపాధ్యాయులు

ఎర్రగొండపాలెం, జూలై 5 : స్థానిక ప్రాథమిక పాఠశాలను విద్యార్థులు అభివృద్ధి చేసుకోవాలని జడ్పీటీసీ సభ్యులు, చేదూరివిజయభాస్కర్‌ అన్నారు. ఎర్రగొండపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యా ర్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు  మంగళవారం పంపిణీ చేసి మాట్లాడారు.  మంగళవారం పాఠశాలల పునఃప్రారంభం కావడంతో మండలంలోని అన్ని పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ జరిగిందన్నారు. ఎంఈవో పి ఆంజనేయులు మాట్లాడుతూ   మండలంలో 10250 మంది విద్యార్ధులు ఉండగా మొదటిరోజు 4000 వేల మంది పాఠశాలలకు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో సర్పంచి ఆర్‌ అరుణాబాయ్‌, ఉపాధ్యాయులు, పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : రేపటితరం భవిష్యత్తుపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, మున్సిపల్‌ చైర్మన్‌ బాలమురళీకృష్ణ అన్నారు. స్థానిక జిల్లా  పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాదీవెన కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అరుణ, ఎంఈవో రాందాస్‌ నాయక్‌, ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్‌రెడ్డి, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌  శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏకలవ్య ఉన్నత పాఠశాలలో విద్యా దీవెన కార్యక్రమం నిర్వహించారు.

కంభం : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎంఈవో జింకా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలు, సమరూప దుస్తులు, బూట్లు, బెల్టులు, బ్యాగ్‌లు, డిక్షనరీలు తదితర విద్యావస్తువులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఖరీదైన విద్యా ఉపకరణాలను ప్రారంభమైన రోజే అందించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో విద్యాకమిటీ చైర్మన్‌ నీలోఫర్‌, హెచ్‌ఎం అమూల్య, సీఆర్‌పీ శైలజ, పేరెంట్స్‌ కమిటీ సభ్యులు,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

పుల్లలచెరువు : పుల్లలచెరువు జేడ్పీ పాఠశాలలో విద్యార్ధులకు జగనన్న విద్యకానుక పంపిణీ జరిగింది.    బెల్టు, సాక్స్‌లు, బుట్లు, 3 జతల బట్టలు,  బ్యాగు, పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఉమామహేశ్వరరావు, పీఎంసీ చైర్మన్‌ లక్ష్మి కుమారి, వైపాలెం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలుకా అఽధ్యక్షుడు షేక్‌ జానిబాషా,  పాల్గొన్నారు.

తర్లుపాడు : మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో జగనన్న విద్యాకానుక కిట్లను ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మీ, జడ్పీటీసీ సభ్యురాలు వెన్నా ఇందిరా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మీ మాట్లాడుతూ.., విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎన్నో కోట్లు  మంజూరు చేసి విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పాఠశాల భవనం కూడా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తర్లుపాడు సర్పంచ్‌ పల్లెపోగు వరాలు, స్థానిక జిల్లా పరిషత్‌ ప్రధానోపాధ్యా యులు మాధవి, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, పలువురు సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

త్రిపురాంతకం: విద్యాకానుక కిట్లను మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు మంగళవారం పంపిణీ చేశారు. దీనిలో భాగంగా, ప్రతి విద్యార్ధికీ మూడు జతల ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగును పంపిణీ చేశారు. కార్యక్రమలలో ఆయా పాఠశాలల ప్రధానోపాద్యాయులు,  సర్పంచులు, విద్యాశాఖాదికారులు పాల్గొన్నారు.

పొదిలి : ప్రభుత్వం పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మర్రిపూడి ఎంపీపీ వాకావెంకటరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి.రంగయ్య, పాఠశాల కమిటీ చైర్మన్‌ అంజలి, ఉపాధ్యాయులు చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T06:47:39+05:30 IST