విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ

ABN , First Publish Date - 2021-03-04T05:20:38+05:30 IST

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా అదనపు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ జోత్న్స బుధవారం ఆలంఖాన్‌పల్లిలోని జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులకు, కార్పొరేషన్‌ పరిధి రవీంద్రనగర్‌లోని పాఠశాల విద్యార్థులకు మహేశ్వరకుమార్‌ ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు.

విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ
విద్యార్థులకు నులి పురుగులమందు వేస్తున్న డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ జ్యోత్న

కడప(కలెక్టరేట్‌), మార్చి 3: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా అదనపు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ జోత్న్స బుధవారం ఆలంఖాన్‌పల్లిలోని జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులకు, కార్పొరేషన్‌ పరిధి రవీంద్రనగర్‌లోని పాఠశాల విద్యార్థులకు మహేశ్వరకుమార్‌ ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నులి పురుగులతో మనిషి ఎదుగుదల ఉండదని, ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా విద్యార్థి దశ నుంచే డాక్టర్లు సూచించిన మేరకు మందులను వాడాలన్నారు. కార్యక్రమంలో  ఎన్‌యూహెచ్‌ఎం టి.వెంకటగోపాల్‌, ఆర్‌కె ఎస్‌కె.నవీన్‌కుమార్‌, డీఎం విష్ణువర్ధన్‌, పీహెచ్‌సీ వైద్యుడు సుదర్శన్‌రెడ్డి, ఎంపీహెచ్‌ఎస్‌ మహబూబ్‌బాషా, మాధవిలత, చంద్ర, మణికుమార్‌, స్వాతిమేరీ, శాంతి, రవికుమార్‌, రామలక్ష్మీవెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.


కమలాపురం(రూరల్‌)లో...

నులిపురుగులు నివారించడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉంటారని పెద్దచెప్పలి పీహెచ్‌సీ డాక్టర్‌ శిరీష తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు మండలంలోని అంగన్వాడీ, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎంపీహెచ్‌ఈ వెంకటరత్నం, సీహెచ్‌వో లలితమ్మ, సూపర్‌వైజరు కొండారెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


పెండ్లిమర్రిలో...

మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో పెండ్లిమర్రి పీహెచ్‌సీ వైద్యుడు బాలకొండ్రాయుడు బుధవారం విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలను వేశారు. ఆయన మాట్లాడుతూ మండలంలో ఇప్పటికే 4,224 మందికి మందులు వేశామని, మిగిలిన వారికి ఈ నెల 9 వరకు ఇవ్వడం జరుగుతుందన్నారు.


సీకేదిన్నెలో... 

మండలంలోని విద్యార్థులకు నులిపురుగుల నివారణకు మాత్రలను పంపిణీ చేసినట్లు వైద్యాధికారిణి శైలజ తెలిపారు. సీకేదిన్నె పరిధిలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో నులిపురుగుల మాత్రలను వైద్యాధికారిణి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని 9వ తేది వరకు కొనసాగిస్తామని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Updated Date - 2021-03-04T05:20:38+05:30 IST