Abn logo
Nov 29 2020 @ 23:15PM

వృద్ధులకు దుప్పట్లు, చీరల పంపిణీ

గూడూరు(రూరల్‌), నవంబరు 29:స్థానిక డీఎన్‌ఆర్‌ కమ్యూనిటీ హాలులో ఆదివారం వైజేపీ లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో బాబురావు దాతృత్వంతో వృద్ధులు, మహిళలకు  దుప్పట్లు, చీరలు, భోజనం ప్యాకెట్లు అందజేశారు. నవీన్‌జయకుమార్‌, బాబురావు, రమణయ్య, సుధాకర్‌, శివరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

కోట : కోట పట్టణ పరిధిలోని నార్త్‌ గిరిజన కాలనీలో జిలానీ బాషా దాతృత్వంతో గ్రీన్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ జలీల్‌ అహ్మద్‌  150 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు.  ఫౌండేషన్‌ ప్రతినిఽధులు నౌషాద్‌ బాషా, ఇలియాజ్‌, షంషుద్దీన్‌, తాజుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు. 

వాకాడు:  తిరుమూరు గ్రామంలో 100 గిరిజన కుటుంబాలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవాసమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య ఆదివారం దుప్పట్లు, కోడిగుడ్లు పంపిణీ చేశారు.  పెళ్ళూరు కోటేశ్వరరెడ్డి, పెళ్ళూరు వెంకటరమణారెడ్డి, బాలయ్య, సులోచనమ్మ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement