స్త్రీనిధి రుణాల్లో అవకతవకలు!

ABN , First Publish Date - 2022-07-02T05:30:00+05:30 IST

స్త్రీనిధి రుణాల్లో అవకతవకలు!

స్త్రీనిధి రుణాల్లో అవకతవకలు!

  • మూడు రోజులుగా ఐనెల్లిలో సెర్ప్‌ అధికారుల సోషల్‌ ఆడిట్‌ 
  • విచారణ పూర్తికాగానే అన్ని వివరాలు వెల్లడిస్తాం
  • వికారాబాద్‌ జిల్లా స్త్రీనిధి ఆర్‌ఎంవో వేణు

తాండూరు రూరల్‌, జూలై 2 : తాండూరు మండలం ఐనెల్లి గ్రామంలో స్త్రీనిధి రుణాల  రికవరీ డబ్బులు స్వాహా అయ్యాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో రాష్ట్ర సెర్ప్‌ అధికారుల బృందం స్టేట్‌ రిసోర్స్‌పర్సన్‌ యాదలక్ష్మి, వికారాబాద్‌ జిల్లా స్త్రీనిధి రీజినల్‌ మేనేజర్‌ వేణు, అసిస్టెంట్‌ మేనేజర్‌ సంతోష్‌ కేతావత్‌, ఏపీఎం ఆనంద్‌లు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ విషయంపై రాష్ట్ర సెర్ప్‌ ఆధ్వర్యంలో అధికారుల బృందం విచారణ జరుపుతోంది. కాగా, ఐనెల్లి గ్రామంలో స్త్రీనిధి కింద 16 సంఘాలకు సుమారు రూ.34లక్షల వరకు రుణాలు అందజేశారు. అయితే, ఇట్టి రుణాల డబ్బులను తిరిగి చెల్లించే క్రమంలో రూ.లక్షల్లో స్వాహా అయినట్లు తెలిసింది. ఈ విషయమై ఉన్నతాధికారులకు తెలియడంతో.. సెర్ప్‌ నుంచి ఇద్దరు అధికారుల బృందం వచ్చి మూడు రోజులుగా సోషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తున్నారని, ఆడిట్‌ పూర్తి కాగానే  స్త్రీనిధి నిధులు దుర్వినియోగం అయ్యాయా? లేదా.. అనే సమాచారం తెలుస్తుందన్నారు. అయితే ఐనెల్లి గ్రామంలో డ్వాక్రా సంఘంలోని మహిళా సంఘాలకు ఎంత మందికి రుణాలుచ్చారు? ఎంత మంది తిరిగి చెల్లించారు? తీసుకున్న వారెందరు? తీసుకోని వారెందరు? ఎంత మంది రుణాలు చెల్లించారు? రికవరీ ఏమేరకు జరిగింది? వ్యాపార లావాదేవీలకోసం ఎంతమంది రుణాలు తీసుకున్నారనే విషయాలపై వివరాలు సేకరించారు. సెర్ప్‌ నుంచి మహిళా జేఆర్‌పీ సోషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తున్నట్లు ఏపీఎం ఆనంద్‌ తెలిపారు.

Updated Date - 2022-07-02T05:30:00+05:30 IST