అసంతృప్తి సెగలు

ABN , First Publish Date - 2022-01-29T05:50:28+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పా టు వ్యవహారం హిందూపురం పా ర్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో అసంతృప్తి సెగలు రాజేస్తోంది.

అసంతృప్తి సెగలు
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ పట్టణంలో శుక్రవారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తున్న అఖిల పక్షం నాయకులు

సత్యసాయి జిల్లా సరే.. పుట్టపర్తి సరికాదు

పెనుకొండ కావాలంటున్న సాధన సమితి

పురం కోసం పట్టుబడుతున్న అఖిలపక్షం

ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత

నేడు హిందూపురం బంద్‌కు పిలుపు

 అనంతపురం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాల ఏర్పా టు వ్యవహారం హిందూపురం పా ర్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో అసంతృప్తి సెగలు రాజేస్తోంది. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసా యి జిల్లా ఏర్పాటుకు ప్ర భు త్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాకు భగవాన సత్యసాయి బాబా పేరు పెట్టడం పట్ల ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కా వడం లేదు. కానీ ఆధ్యాత్మిక కేందరం పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా నిర్ణయించడాన్ని హిందూపురంవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లోకసభ నియోజకవర్గ కేంద్రా న్ని కాదని పుట్టపర్తిని జిల్లా కేంద్రం గా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు, వ్యాపార, వాణిజ్య సౌకర్యాలున్న హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆ ప్రాంత అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయానికి తావు ఇవ్వవద్దని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే హిందూపురం పట్టణానికి చెందిన వైసీపీయేతర పక్షాలన్నీ ఒకటిగా ఏర్పడి హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని నినదిస్తున్నాయి. డిమాండ్‌ సాధన కోసంం శనివారం హిందూపురం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. 


ఇరకాటంలో ఇక్బాల్‌

పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఇరకాటంలో పడ్డారు. వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే  హిందూపురాన్ని జిల్లా కేంద్రం గా ప్రకటిస్తామని మున్సిపల్‌ ఎన్నికల సమయంలో ఆయన హామీ ఇచ్చారు. దీన్ని గుర్తు చేస్తూ విపక్షాలవారు ఆయనపై మాటల తూటాలు వదులుతున్నారు. మౌనం వీడి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


పెనుకొండకు ఇవ్వండి..

శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్య రెండో రాజధానిగా ఉ న్న పెనుకొండను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పెనుకొండ జిల్లా సాధన సమితి డిమాండ్‌ చేస్తోంది.  కొ త్త జిల్లాల ప్రతిపాదన సమయం నుంచి తన వాణిని వినిపిస్తోంది. పెనుకొండలో రెవెన్యూ డివిజన, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, వివిధ ప్ర భుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు ఉన్నా యి. జాతీయ రహదారికి సమీపంలో ఉంది. అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. మెడికల్‌ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కియా పరిశ్రమ, దాని అనుబంధ సంస్థలు పెనుకొండ పరిధిలో ఉన్నాయి. కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన వందలాది ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ప్రభుత్వ జూనియర్‌ డిగ్రీ కళాశాలలు ఉ న్నాయి. ఇన్ని అనుకూలతలు ఉన్న పెనుకొండను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని సమితి డిమాండ్‌ చేస్తోంది.


భక్తులకు ఇబ్బంది కదా..

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే భక్తులకు ఇబ్బంది కలుగుతుందని హిందూపురం, పెనుకొండ ప్రాంతాలవారు అంటున్నారు. ఆధ్యాత్మిక కేంద్రం జిల్లా కేంద్రంగా మారితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని అం టున్నారు. ఎవరికి వారు తమ పట్టణాలను జిల్లా కేంద్రంగా చేయాలని బలమైన వాదన వినిపిస్తున్నారు. జిల్లా కేంద్రం కోసం రెండు ప్రాంతాల నాయకులు, వాణిజ్య, వ్యాపార వర్గాలవారు పట్టుబడుతున్నారు. ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.



రాజకీయం కోసం బలిచేయొద్దు

రాజకీయ కుట్రలో భాగంగానే హిం దూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించలేదు. ప్రభుత్వం ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో హిందూపురానికి మంచి గుర్తింపు ఉంది. ఆసి యా ఖండంలోనే పేరొందిన చింతపండు, పట్టుగూళ్ల మార్కెట్‌లు ఉన్నా యి. జాతీయ రహదారి, రైల్వే లైను, విద్యాసంస్థలు ఉన్నాయి. హిందూ పురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి, హామీని నిలబెట్టుకోవాలి. గతంలో మెడికల్‌ కళాశాలను పోగొట్టుకున్నాం. జిల్లా కేంద్ర మైనా వస్తుందనుకున్నాం. హిందూపురాన్ని జిల్లా కేం ద్రంగా ప్రకటించేంత వరకూ ఉద్యమం ఆగదు.

- అంబికాలక్ష్మీనారాయణ, టీడీపీ హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి


అశాస్త్రీయ నిర్ణయం

కొత్త జిల్లాను అశాస్ర్తీయంగా, అర్థరహితంగా ప్రకటించారు. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిన హిందూపురాన్ని వదిలేసి పుట్టపర్తిని జిల్లాకేంద్రంగా ప్రకటించ డం దారుణం. ఇక్కడి ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు.

- శ్యామ్‌కిరణ్‌, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ కన్వీనర్‌ 


పోరాటం చేస్తాం

రాజకీయ కుతంత్రాలకు హిందూపురాన్ని బలిచేస్తే చూస్తూ ఊరుకోం. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించేంత వరకూ పోరాటం చేస్తాం. అధికార పార్టీకి, ప్రభుత్వానికి ఇక్కడి ప్రజల మనోభావాలతో పనిలేదా..? పురం ప్రజాప్రతినిధలు పార్టీలకు అతీతంగా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ తన హామీని నిలబెట్టుకోవాలి. 

- పీడీ పార్థసారథి, బీజేపీ హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి 


మాట తప్పారు 

లోకసభ నియోజకవర్గ కేంద్రాలనే జి ల్లా కేంద్రాలుగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన మాట తాప్పరు. జిల్లా కేంద్రం ఏర్పాటుకు అవసరమై న అన్ని వసతులు పురంలో ఉన్నా యి. పురం ప్రజలపై కక్షతోనే ప్రభు త్వం ఇలా చేస్తోంది. సత్యసాయి జి ల్లాగా నామకరణం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఒప్పుకోం.

- ఆకుల ఉమేష్‌, హిందూపురం ఇనచార్జ్‌, జనసేన


మంచి నిర్ణయం కాదు

స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే హిందూపురానికి గుర్తింపు ఉంది. అనంతపురం తరువాత ఇక్కడే అత్యధిక జనాభా ఉంది. ఏ కోణంలో చూసినా జిల్లా కేంద్రంగా హిందూపురంమే సరైనది. పురం ప్రజల దశాబ్దాల ఆశలపై ప్ర భుత్వం నీళ్లు చల్లింది. ఇది మంచిది కాదు. పురం ప్రజల ఆశలు, ఆకాంక్ష నెరవేర్చే వరకూ పోరాడతాం.

- వెంకటరామిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, పట్టు రైతుల సంఘం


పెనుకొండను ప్రకటించాలి

పెనుకొండ కేంద్రంగా శ్రీకృష్ణదేవరాయల జిల్లాను ప్రకటించాలి. సత్యసాయి జిల్లాను రద్దు చేయాలి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. పెనుకొండ, పుట్టపర్తిలో ఏ ప్రాంతం అనుకూలమో తేల్చాలి. ఆ తరువాతే జిల్లా కేంద్రంపై నిర్ణయం తీసుకోవాలి. పెనుకొండలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నాయి. మెడికల్‌ కాలేజీ నిర్మాణం జరుగుతోంది. అన్ని హంగులున్న పెనుకొండను కాదని పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం సరికాదు. 

- ప్రతాప్‌రెడ్డి, అధ్యక్షుడు, పెనుకొండ పర్యాటక పోరాట కమిటీ

Updated Date - 2022-01-29T05:50:28+05:30 IST