నిబంధనలు బేఖాతర్‌!

ABN , First Publish Date - 2021-06-13T05:10:29+05:30 IST

2021-22 విద్యా సంవత్సరానికి సంబంధి ంచి విద్యాశాఖ నుంచి ఇంకా ఎలాంటి షె డ్యూల్‌ విడుదల కాకుండానే జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించాయి.

నిబంధనలు బేఖాతర్‌!

జిల్లాలో షెడ్యూల్‌ రాకముందే ఆన్‌లైన్‌ తరగతులు
ప్రత్యేక యాప్‌లతో దోపిడీ
ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యం
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 12: 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధి ంచి విద్యాశాఖ నుంచి ఇంకా ఎలాంటి షె డ్యూల్‌ విడుదల కాకుండానే జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించాయి. షెడ్యూల్‌ విడుదల చేయకముందే ప్రత్యేక యాప్‌లను రూపొందించి విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాల పేరుతో దోపిడీని షురూ చేశారు. గత యేడాది షెడ్యూల్‌ ప్రకారం ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించి దాదాపుగా పూర్తిస్థాయి ఫీజులను వసూలు చేశాయి. ఈ విద్యా సం వత్సరానికి సంబంధించి ఫీజులు, అకాడమి క్‌ క్యాలెండర్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకముందే ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజుల పేరుతో విద్యార్థుల ను వారి తల్లిదండ్రులను ఒత్తిడికి గురిచేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కరోనా కష్టకాలంలో గత యేడాదికాలంగా ఆర్థికంగా ఇ బ్బందులను ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల దోపిడీ దాహానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యా స ంవత్సరం ఆరంభంకాకముందే ఫీజులు, పు స్తకాలు అంటూ ప్రైవేటు విద్యాసంస్థలు వి ద్యార్థుల తల్లిదండ్రులకు మెసెజ్‌లు పంపుతునట్లు తెలుస్తోంది. గత విద్యా సంవత్స ర ం పూర్తిగా ఆన్‌లైన్‌ పాఠశాలకు పరిమితమైనా విద్యార్థులకు ప్రైవేట్‌ పాఠశాలలు పూర్తిస్థాయి ఫీజులను వసూలు చేశాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలలైతే మొత్తం ఫీజులను ముక్కుపిండి వసూలు చేసినట్లు ఆరో పణలున్నాయి. ఈ అంశంపై గత యేడాది విద్యార్థి సంఘాలు అనేక ఉద్యమాలు చేసి నా విద్యాశాఖ అధికారులు మాత్రం పాఠశాలలపై చర్యలకు వెనకడుగు వేస్తున్నారు. ఫీ జుల వసూలు విషయంలోనూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ తమకు ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ ప్రైవేటు పాఠశాలలు ఫీజుల వసూలు విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు.
ఆన్‌లైన్‌తో ఖర్చు తక్కువే..
గత యేడాది మొత్తం ఆన్‌లైన్‌ పాఠాలకే విద్యార్థులు పరిమితమయ్యారు. కేవలం ఆ న్‌లైన్‌ పాఠాలకే ప్రైవేటు పాఠశాలలు వి ద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశారు. కేవలం 8, 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ఒక నెల పాటు ప్రత్యక్ష తరగతు లు గత యేడాది నిర్వహించారు. సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చుల పేరుతో ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల నుంచి ఫీజులు వ సూలు చేశారు. ఫీజులు కట్టకపోతే మీ పిల్లలను పై తరగతులకు ప్రమోట్‌ చేయడం క ష్టమని, గ్రేడింగ్‌ ఇవ్వలేమని చెబుతూ పూ ర్తిస్థాయి ఫీజులు వసూలు చేశారు. జిల్లా కే ంద్రంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజు ల విషయంలో ఇబ్బందులకు గురిచేయగా తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. వి నాయక్‌నగర్‌లోని ఒక పేరు పొందిన పాఠశాలకు వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రు లు ఒక సంఘం ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది. ప్రైవేటు పాఠశాలలు ఫీజుల దోపిడీపై విద్యాశాఖ, అధికారులకు అనేక ఫిర్యాదులు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
యాప్‌ల పేరుతో దోపిడీ
ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతుల కోసం తమకు నచ్చిన రీతిలో ప్రత్యేక యా ప్‌లను రూపొందించి తరగతులు నిర్వహించారు. తమకు ఏది తక్కువ ఖర్చు అయితే ఆ యాప్‌ల ద్వారా తరగతులు నిర్వహిస్తూ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇటీవల నగరంలోని ఓ పాఠశాల ఈ విద్యా సంవత్సరం ఎలాంటి షెడ్యూల్‌ విడుదల కాకముందే ఆ న్‌లైన్‌ తరగతులు నిర్వహించడం వివాదస్పదమైంది. విద్యార్థి సంఘాలు ఈ విషయ ంపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సద రు పాఠశాల ఫీజుల విషయంలోనూ విద్యార్థుల తల్లిద ండ్రులను ఇబ్బందికి గురిచేసిన ట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో విద్యార్థి సంఘాలు కలెక్టర్‌ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
తరగతులు ప్రారంభిస్తే కఠిన చర్యలు
- ఎన్‌వీ దుర్గాప్రసాద్‌, డీఈవో

2021-22 విద్యా సంవత్సరానికి సం బంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి షెడ్యూల్‌ విడుదల కాలేదు. ఆన్‌లై న్‌ తరగతులకు సంబంధించి ప్ర భుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. జిల్లాలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృ ష్టికి వచ్చింది. ఫీజులు, పుస్తకాల విషయంలో విద్యార్థులను ఇబ్బం దులకు గురిచేయవద్దు. ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-06-13T05:10:29+05:30 IST