‘మత్స్య సహకార సంఘంలో అనర్హుల సభ్యత్వాన్ని రద్దు చేయాలి’

ABN , First Publish Date - 2020-07-14T11:25:34+05:30 IST

మత్స్య సహకార సంఘంలో అనర్హులకు కల్పించిన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఖా నాపూర్‌ మత్స్య పారిశ్రామిక సహకార

‘మత్స్య సహకార సంఘంలో  అనర్హుల సభ్యత్వాన్ని రద్దు చేయాలి’

నిర్మల్‌ టౌన్‌, జూలై 13: మత్స్య సహకార సంఘంలో అనర్హులకు కల్పించిన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఖా నాపూర్‌ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. అంతకుముందు మత్స్యశాఖ కా ర్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో స్వతంత్రానికి ముందు నుంచి వందేళ్లకు పైగా చేపల వేటను కొనసాగిస్తూ కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, అభివృద్ధికి ప్రభుత్వం పారిశ్రామిక సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వ పథకాలు పొందడంలో ప్రాథమిక హక్కు ఉంటుందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడారన్నారు.


అరుతేఏ మత్స్య సహకార సంఘం జిల్లా ఏడీ దేవేందర్‌ ముదిరాజ్‌ కులానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఖానాపూర్‌ పట్టణంలో ఆది నుంచి సంపద్రాయ మత్స్యకారులం అయిన మాకు ఇప్పటి వరకు 52 మందికి మాత్రమే సభ్యత్వం ఉందని, సభ్యత్వం పొందే అవకాశం లేనప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా 59 మంది ముదిరాజ్‌లకు ఏడీ సభ్యత్వం కల్పించారని ఆరోపించారు. మా సంఘ సభ్యులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అన్ని అర్హతలు ఉన్న తాము ప్రభుత్వ పథకాలకు దూరం అయ్యే ప్రమాదం ఉందని, అనర్హులైన ముదిరాజ్‌ కులస్థులకు సహకార సంఘంలో కల్పించిన సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఏడీ తన కులానికి లబ్ధి చేకూర్చేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఆయన తీరుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-14T11:25:34+05:30 IST