రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిన భార్య.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాపురానికి రాకపోవడంతో భర్తలో ఆగ్రహం.. నేరుగా అత్తారింటికి వెళ్లి..

ABN , First Publish Date - 2021-10-22T22:09:41+05:30 IST

ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చెలరేగాయి. దీంతో భార్య రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. భార్యని వదిలి ఉండలేక భర్త ఆమెకు చాలాసార్లు ఫోన్ చేశాడు. తిరిగి ఇంటికి రమ్మని బతిమాలాడి ఒప్పించే ప్రయత్నం చేశాడు

రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిన భార్య.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాపురానికి రాకపోవడంతో భర్తలో ఆగ్రహం.. నేరుగా అత్తారింటికి వెళ్లి..

భోపాల్: ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చెలరేగాయి. దీంతో భార్య రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. భార్యని వదిలి ఉండలేక భర్త ఆమెకు చాలాసార్లు ఫోన్ చేశాడు. తిరిగి ఇంటికి రమ్మని బతిమాలాడి ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయినా ఆమె కాపురానికి రాకపోవడంతో భర్తలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోపంతో భార్యకోసం అత్తారింటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఏం జరిగిందో తెలిస్తే..


మధ్యప్రదేశ్‌లోని బిల్గాన్ గ్రామానికి చెందిన మేనకకు శిఖాపూర్‌ ప్రాంతానికి చెందిన రాజు సింగ్‌తో పెళ్లి జరిగింది. పెళ్లైన కొద్దిరోజుల తర్వాత భార్య భర్తల మధ్య కలహాలు ఏర్పడడంతో మేనక రెండునెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వెళ్లినప్పటి నుంచి భర్త చాలాసార్లు ఫోన్ చేసి తిరిగిరమ్మని అడిగాడు. అయినా ఆమె కాపురానికి రాలేదు. ఈ క్రమంలోనే శనివారం రాజు సింగ్ భార్యతో మాట్లాడి ఆమెను ఒప్పించి తీసుకెళ్లడానికి అత్తారింటికి వెళ్లాడు. అక్కడ మేనకతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె భర్తతో వెళ్లడానికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా మేనక కుటుంబసభ్యులు కూడా ఆమెను అత్తారింటికి పంపించడానికి ఒప్పుకోలేదు. ఈ విషయంపై రాజుకు, అత్తింటి వారికి చాలా వివాదాలు జరిగాయి.


ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం భార్యాభర్తలిద్దరి మధ్య ఇదే విషయమై మళ్లీ గొడవ జరిగింది. దీంతో భార్యపై ఆగ్రహం పెంచుకున్న రాజు అత్తాంరిటి నుంచి కొంచెం దూరం వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సగానికి పైగా కాలిపోయి విషమ పరిస్థితిలో ఉన్న రాజును మేనక కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ అతడిని పరీక్షించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం మెడికల్ కాలేజికి తరలించారు.

Updated Date - 2021-10-22T22:09:41+05:30 IST