వాడి పారేసిన పీపీఈ కిట్లతో జీవ ఇంధనం

ABN , First Publish Date - 2020-08-05T07:50:12+05:30 IST

కరోనా సంక్షోభంతో వ్యక్తిగత రక్షణ ఉపకరణాల (పీపీఈ) వాడకం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వాడి పారేసిన పీపీఈ కిట్ల వ్యర్థాలు పెద్ద

వాడి పారేసిన పీపీఈ కిట్లతో జీవ ఇంధనం

  • డెహ్రాడూన్‌ శాస్త్రవేత్తల వినూత్న ఆలోచన 

డెహ్రాడూన్‌, ఆగస్టు 4 : కరోనా సంక్షోభంతో వ్యక్తిగత రక్షణ ఉపకరణాల (పీపీఈ) వాడకం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వాడి పారేసిన పీపీఈ కిట్ల వ్యర్థాలు పెద్ద మోతాదులో పేరుకుపోతున్నాయి. ఈనేపథ్యంలో పీపీఈ కిట్ల వ్యర్థాలను కరిగించి పునరుత్పాదక ద్రవ ఇంధనంగా మార్చాలనే ప్రతిపాదనతో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు. ఇందుకోసం ‘పైరోలిసిస్‌’ అనే రసాయన చర్యను వినియోగించవచ్చని సూచించారు. ఈ ప్రక్రియలో భాగంగా పీపీఈ కిట్లను ఆక్సిజన్‌ అందని పరిస్థితుల్లో.. 300 నుంచి 400 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రత వద్ద కరిగించి, ద్రవ రూపంలోని జీవ ఇంధనాన్ని సేకరిస్తారు. ఇది మిగతా శిలాజ ఇంధనాల్లా మండే గుణాన్ని కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

Updated Date - 2020-08-05T07:50:12+05:30 IST