Abn logo
May 8 2021 @ 00:50AM

రోడ్డు ప్రమాదాలు నివారించండి: కలెక్టర్‌

ఏలూరు, మే 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసు కోవాలని కలెక్టర్‌ కార్తికే య మిశ్రా అధికారులను ఆదే శించారు. కలెక్టరేట్‌లో శుక్రవా రం జిల్లా రహదారి భద్రతా కమి టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  రోడ్డు పనులు పూర్తైన చోట ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారిపై బ్లాక్‌ స్పాట్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారిం చాలన్నారు. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి కలపర్రు టోల్‌గేటు వరకూ పనులు వేగం గా పూర్తి చేయాలని సూచించారు. వాహనాలు నిలుపు ప్రాంతాలు కూడా సిద్ధం చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న పలు రహదారి పనులపై ఆయన సమీక్షించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి, డీటీసీ సిరి ఆనంద్‌, ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ నిర్మల, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఈవీఎం గోదాము తనిఖీ

 ప్రతి నెలా తనిఖీల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌ ఆవరణలో ఉన్న ఈవీఎం, వీవీ పాట్ల గోదామును జిల్లా ఎన్నికల అధికారి కార్తికేయ మిశ్రా పరిశీలించారు. ట్రైనీ కలెక్టర్‌తో పాటు ఇన్‌చార్జి డీఆర్వో ఉదయ భాస్కర్‌, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రవీంద్ర, సీనియర్‌ అసిస్టెంట్‌ రాధాకృష్ణ పాల్గొన్నారు. 

గృహ నిర్మాణ లబ్ధిదారులను గుర్తించండి 

 వచ్చే జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న లబ్ధిదారుల వివరాలను సేకరించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. పేదలకు గృహ నిర్మాణంపై శుక్రవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడుతూ వలంటీర్లు తమ పరిధిలో ఉన్న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నవారి జాబితా రూపొం దించాలన్నారు. పెండింగులో ఉన్న జియో ట్యాగింగ్‌, మ్యాపింగ్‌, లబ్దిదారుల రిజిస్ట్రేషన్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌ కార్డు మ్యాపింగ్‌తో పాటు డేటాను అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఉపాధి పథకం కింద ఎక్కువ మందికి పనులు చూపించిన ఎంపీడీఓలను  ఆయన అఽభినందించారు. అదే స్ఫూర్తితో వీరి సంఖ్య 3 లక్షల 50 వేలకు పెరిగేలా కృషి చేయాలన్నారు. వీసీలో హౌసింగ్‌ పీడీ రామరాజు, డ్వామా పీడీ రాంబాబు, హౌసింగ్‌ డీఈలు పాల్గొన్నారు.


Advertisement