రియల్‌మి టెక్లైఫ్ బ్రాండ్ ‘డిజో’ సరికొత్త ఇయర్ ఫోన్‌ని మన దేశంలో విడుదల చేసింది. డిజో వైర్లెస్ డ్యాష్‌గా దీనిని చెబుతున్నారు. ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్‌లో 11.2ఎంఎం డ్రైవర్స్ ఉన్నాయి. బ్లూటూత్‌పై ఆధారపడి ఇయర్‌బడ్స్ పనిచేస్తాయి. ఒకసారి చార్జింగ్ చేస్తే 30 గంటలు పనిచేస్తుంది. పదినిమిషాల చార్జింగ్‌తో పదిగంటల సేపు ప్లే బ్యాక్ ఉంటుంది. ఇది సిలికాన్ నెక్‌బ్యాండ్ కాగా, స్కిన్ ఫ్రెండ్లీకి తోడు వినియోగదారుడికి సౌకర్యంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. సూపర్ స్లో లేటెన్సీ 88ఎంఎస్ సపోర్ట్ గేమింగ్ మోడ్‌కు ఉంది. మ్యూజిక్ అలాగే కాల్స్ తదితరాలు ఉపయోగ పడేలా రూపొందించారు. రేటు రూ.1599 కాగా ఆరంభ ధరను రూ.1299గా ప్రకటించారు. ఈ నెల 24 నుంచి ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.