సబ్‌ రిజిస్ట్రార్ల బరితెగింపు!

ABN , First Publish Date - 2021-11-17T08:33:27+05:30 IST

ఆస్తు ల రిజిస్ట్రేషన్ల విషయంలో సబ్‌ రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఎన్ని ఆరోపణలు వస్తున్నా వారి తీరు మాత్రం మారడంలేదు.

సబ్‌ రిజిస్ట్రార్ల బరితెగింపు!

  • నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు
  • అక్రమాలు వెల్లడైనా.. మారని తీరు
  • 1,643 డాక్యుమెంట్లను అక్రమంగా
  • రిజిస్ట్రేషన్‌ చేసిన ఓ ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌
  • డీఐజీల స్పెషల్‌ ఆడిట్‌తో బట్టబయలు 
  • వరంగల్‌, మేడ్చల్‌, హైదరాబాద్‌ జిల్లాల్లోని
  • ఎస్‌ఆర్‌లపై అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులు
  • ఉన్నతాధికారులకు చేరిన కొందరి వ్యవహారం
  • చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు   


 హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆస్తు ల రిజిస్ట్రేషన్ల విషయంలో సబ్‌ రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఎన్ని ఆరోపణలు వస్తున్నా వారి తీరు మాత్రం మారడంలేదు. డాక్యుమెంట్లు నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా.. రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఇందుకోసం చదరపు గజానికి ఇంత, చదరపు అడుగుకు ఇంత.. అని లెక్కగట్టి మరీ వసూలు చేస్తున్నారు. విచారణలో వారి అవినీతి బాగోతాలు వెల్లడై నా.. అధికారులు చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తుండడంతో సబ్‌ రిజిస్ట్రార్లు మరింత బరితెగిస్తున్నారు. వాస్తవానికి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకుగాను గతంలోనే స్టాంపు లు, రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం 2020 ఆగస్టు 26న మె మో(రెఫరెన్స్‌-జీ2/257/2019) జారీ చేశారు.అయితే ఈ నిబంధనలతో పేద, బలహీన వర్గాల కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో 100 గజాల్లోపు స్థలాలను, నిర్మాణాలను ఇంటి నెంబర్లు ప్రామాణికంగా తీసుకొని రిజిస్ర్టేషన్‌ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కానీ, కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు అనధికార లే అవుట్లలోని స్థలాలకు, లింక్‌ డాక్యుమెంట్‌ లే ని స్థలాలకు కూడా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. ఇందుకోసం చదరపు అడుగుకు రూ.500 నుంచి రూ.1000 వరకు లంచంగా వసూలు చేస్తున్నారు. దీనిపై పలువురు  ఫిర్యాదు చేయడంతో పలు జిల్లాల రిజిస్ర్టార్‌లు, డీఐజీలు అంతర్గత విచారణ చేపట్టారు. ఆయా సబ్‌ రిజిస్ర్టార్‌ల అక్రమాలపై ఇటీవల ఆ శాఖ కమిషనర్‌కు ని వేదిక అందించారు. 


సబ్‌ రిజిస్ట్రార్ల అవినీతి ఇలా..

విచారణలో కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు వందల సం ఖ్యలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌ చేసినట్లు వెల్లడైంది. వీరిలో వరంగల్‌ జిల్లాకు చెందిన ఒక ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ర్టార్‌ రి జిస్ట్రేషన్‌ చేసిన డాక్యుమెంట్లలో.. ఏకంగా 1,643 డా క్యుమెంట్లు నిబంధనలకు విరుద్ధంగా, సాంకేతిక లో పాలతో కూడి ఉన్నట్లు గుర్తించారు. మరో సబ్‌ రిజిస్ర్టార్‌ 85 డాక్యుమెంట్లను, ఇంకొకరు 178, మరొకరు 175 డాక్యుమెంట్ల ను ఇలాగే రిజిస్ర్టేషన్‌ చేసినట్లు తేలింది. వీరిలో ఇద్దరిని అధికారులు సస్పెండ్‌ చేశా రు. మరో ఇద్దరికి మినహాయింపు ఇచ్చారు. గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సుదీర్ఘకాలం పని చేసిన ఓ ఉన్నతాధికారి ఈ ఇద్దరు అవినీతి సబ్‌ రిజిస్ర్టార్లను సస్పెన్షన్ల నుంచి కాపాడుతున్నారని సాక్షాత్తు ఆ శాఖ అధికారులే ఆరోపిస్తున్నారు. ఇక హైదరాబాద్‌ జిల్లాలో ఓ సబ్‌ రిజిస్ర్టార్‌ సాయంత్రం 6గంటల వరకు లంచం ముట్టజెప్పిన తరువాతే రిజిస్ర్టేషన్లు చేస్తున్నట్లు   ఫి ర్యాదులందాయి. ఇలా ఓవృద్ధుడి డాక్యుమెంట్‌ను సా యంత్రం వరకు రిజిస్ర్టేషన్‌ చేయకపోవడంతో అతడు కార్యాలయంలోనే స్పృహతప్పి పడిపోయాడని, ఆ తరువాత చనిపోయాడని ఫిర్యాదు అందింది. 


దీంతో ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాడు. ఇతని వ్య వహారంపై 25 రోజుల క్రితమే నివేదిక అందించినా ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కాగా, గతంలో రంగారెడ్డిలో పని చేస్తున్న సమయంలో ఏసీబీకి చిక్కిన ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రస్తుతం మేడ్చల్‌ జిల్లాలో పని చేస్తున్నారు. లంచం ఇచ్చేవరకు రిజిస్ట్రేషన్‌ చేయరని ఈమెపై పదుల సం ఖ్యలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. గతం లో ఏసీబీకి చిక్కినా.. ఆమెలో మార్పు రాలేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అయినా ఈ సబ్‌ రిజిస్ర్టార్‌పై చర్యలకు ఇప్పటివరకు ఎలాంటి నివేదిక అందించలేదని, లోలోపలే సెటిల్‌మెంట్‌ చేస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.


కొత్తగా ఉద్యోగంలో చేరినా.. 

హైదరాబాద్‌ జిల్లాలో ఓ సబ్‌ రిజిస్ర్టార్‌ ఎనిమిది నెలల క్రితమే ఉద్యోగంలో చేరారు. కానీ, ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుంటే రూ.1000, లింక్‌ డాక్యుమెంట్‌ ఉండి ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుంటే రూ.500 ఇవ్వాలని క్యాలిక్యులేటర్‌లో లెక్క చేసి మరీ క్రయవిక్రయదారుల నుంచి లంచం వసూలు చేస్తున్నారని జిల్లా రిజిస్ర్టార్‌ నుంచి డీఐజీ వరకు ఫిర్యాదులు అందాయి. ఈమెకు ‘క్యాలిక్యులేటర్‌  మేడమ్‌’ అని నిక్‌నేమ్‌ కూడా పెట్టినట్లు ఉన్నతాధికారులకు తెలిసింది. కానీ ఈ సబ్‌ రిజిస్ట్రార్‌పై ఫిర్యాదులకు సంబంధించిన నివేదికను అధికారులు తొక్కిపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఒక్కరు, ఇద్దరు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 సబ్‌ రిజిస్ర్టార్‌లలో 45-50 మంది సబ్‌ రిజిస్రార్లు లంచం ముట్టనిదే.. దస్తావేజును ముట్టడం లేదని విచారణలో తేలింది. అయినా వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంపై ఆ శాఖ ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-11-17T08:33:27+05:30 IST