Abn logo
Sep 21 2021 @ 01:18AM

రాహుల్‌పై పరువునష్టం కేసు కొట్టివేత

ముంబై, సెప్టెంబరు 20: మహాత్మా గాంధీని ‘ఆరెస్సెస్‌ మనుషులే’ చంపారంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై దాఖలైన వ్యాజ్యాన్ని బాంబే హైకోర్టు కొట్టేసింది. 2014లో భివండీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌ అభ్యంతరకర ప్రసంగం చేశారని ఆరోపిస్తూ ఆరెస్సెస్‌ నేత రాజేశ్‌ కుంతే కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌పై క్రిమినల్‌ పరువునష్ట దావాలో సాక్ష్యంగా ఈ ప్రసంగం పాఠాన్ని అనుమతించాలని పిటిషనర్‌ కోరారు. న్యాయమూర్తి జస్టిస్‌ రేవతి మొహితే డేరే ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని తిరస్కరించింది.