విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన కాంట్రాక్టు అధ్యాపకుడి తొలగింపు

ABN , First Publish Date - 2022-08-08T05:16:33+05:30 IST

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి జీవితాలను నిలబెట్టాల్సిన ఓ అధ్యాపకుడు వక్రబుద్దితో తన సొంత కూతురు కన్నా చిన్న వయస్సుగల విద్యార్థినిపై కన్నేశాడు.

విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన కాంట్రాక్టు అధ్యాపకుడి తొలగింపు

 భద్రాద్రి జిల్లాలోని ఓ పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి

 ఆర్జేడీ, కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన కళాశాల ప్రిన్సిపాల్‌

చుంచుపల్లి, ఆగస్టు 7: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి జీవితాలను నిలబెట్టాల్సిన ఓ అధ్యాపకుడు వక్రబుద్దితో తన సొంత కూతురు కన్నా చిన్న వయస్సుగల విద్యార్థినిపై కన్నేశాడు. ఆ విద్యార్థినితో చనువుగా ఉండేందుకు సదరు అధ్యాపకుడు మరో బాధిత విద్యార్థిని వాడుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2008 నుంచి ఆ కళాశాలలో కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న అధ్యాపకుడు గత ఏడాది ఓ విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించాడు. జరిగిన సంఘటని కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలియచేయగా పూర్తిగా విచారించి అధ్యాపకుడికి షోకాజు నోటీసులు జారీ చేసి మందలించారు. అయినా తీరుమారని సదరు ఆధ్యాపకుడు మరో విద్యార్థినితో చనువుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ విద్యార్థి ఎదిరించడంతో గత ఏడాది బాధిత విద్యార్థినిని పావుగా వాడుకున్నాడు. ఈ వ్యవహారం మరోసారి కళాశాల ప్రిన్సిపాల్‌ వద్దకు చేరగా ఆ కళాశాలలో పని చేసే అధ్యాపకులతో సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించగా ఆ ఇద్దరు విద్యార్థినులతో పోలీస్‌ అధికారులు మాట్లాడారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌జేడీ, కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆ అధ్యాపకుడిని విధుల నుంచి తొలగించారు.  


Updated Date - 2022-08-08T05:16:33+05:30 IST