మరో మూడు పిఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ >

ABN , First Publish Date - 2021-07-30T22:23:05+05:30 IST

మరో మూడు పిఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ >

మరో మూడు పిఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ >

న్యూఢిల్లీ : జీవిత బీమా సంస్థ విషయంలో మాదిరిగానే మరో మూడు పిఎస్‌యూల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌, మిశ్ర దాతు నిగమ్‌ లిమిటెడ్‌, రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌‌లలో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఒఎఫ్‌ఎస్‌) పద్దతిలో వాటాలను విక్రయించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల నుంచి వినవస్తోంది. వచ్చే అక్టోబరుతో ప్రారంభం కానున్న త్రైమాసికంలో... ఈ ఉపసంహరణలను చేపట్టే అవకాశముందని చెబుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఉండే అవకాశమున్నట్లు ఇప్పటికే తెలుస్తోన్న విషయం తెలిసిందే.


అంతకుముందే ఈ మూడు పీఎస్‌యూల్లో వాటాల విక్రయం ఉండనున్నట్లు భావిస్తున్నారు. ఎల్‌ఐసీ డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఇటీవలే ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీపీఈఏ) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎల్‌ఐసిలో రూ. 1-1.5 లక్షల కోట్ల విలువ చేసే వాటాలను ప్రైవేటు సంస్థలకు అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2021-07-30T22:23:05+05:30 IST