డాక్టర్‌ దిశ సేవలు మరువలేనివి : కొల్లూర్‌ సర్పంచ్‌ సౌజన్య

ABN , First Publish Date - 2020-11-29T04:18:18+05:30 IST

మండలంలోని కొల్లూర్‌ గ్రామంలో పశు శైద్యాధికారి డాక్టర్‌ దిశ సేవలు మరువలేనివని కొల్లూర్‌ గ్రామ సర్పంచ్‌ సౌజన్య, నవాబ్‌పేట పశువైద్యాధికారి డాక్టర్‌ స్వప్న అన్నారు.

డాక్టర్‌ దిశ సేవలు మరువలేనివి :  కొల్లూర్‌ సర్పంచ్‌ సౌజన్య
పశువైద్యాధికారి దిశకు నివాళి అర్పిస్తున్న సర్పంచు, వైద్యులు, సిబ్బంది

నవాబ్‌పేట, నవంబరు 28 : మండలంలోని కొల్లూర్‌ గ్రామంలో పశు శైద్యాధికారి డాక్టర్‌ దిశ సేవలు మరువలేనివని కొల్లూర్‌ గ్రామ సర్పంచ్‌ సౌజన్య, నవాబ్‌పేట పశువైద్యాధికారి డాక్టర్‌ స్వప్న అన్నారు. శనివారం దిశ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని పశువైద్యాధికారి కార్యాలయంలో దిశ చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. ఆమె మరణించి ఏడాది గడుస్తున్న ఇంకా ఆమె జ్ఞాపకాలు మరువలేకపోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో స్థానిక నాయకులు మంచికంటి రఘు, వైద్య సిబ్బంది శ్రీవాణి, కృష్ణ, రాజేష్‌, మల్లేష్‌, సర్వర్‌, వెంకటేష్‌, మల్లేష్‌, సంజీవయ్య, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T04:18:18+05:30 IST