Abn logo
Sep 25 2020 @ 01:42AM

తార స్థానంలో దిశా

Kaakateeya

బాలీవుడ్‌ చిత్రం ‘మలంగ్‌’ స్టార్స్‌ దిశాపటానీ, ఆదిత్యారాయ్‌ కపూర్‌లు ఇప్పుడు మళ్లీ అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఓం’ చిత్రంలో నటించబోతున్నారు. స్రిప్ట్‌ నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు హీరోయిన్‌ తారా సుతారియా గతంలోనే అంగీకరించారు. కానీ ఇప్పుడు ఆమెను కాదనుకొని  హీరోయిన్‌గా దిశాను తీసుకున్నారని సమాచారం. మలంగ్‌ చిత్రంలో దిశా, ఆదిత్యా జంట ప్రేక్షకులను బాగా అలరించింది.  వారిద్దరూ కలసి ఆ సినిమా ప్రమోషన్లలోనూ పాల్గొన్నారు. ఈ జంట మరోసారి హిట్‌ఫెయిర్‌గా నిలుస్తారేమో చూడాలి.

Advertisement
Advertisement