Abn logo
Feb 21 2020 @ 22:12PM

వారి బ్రేకప్‌కి బ్రేకులు పడ్డట్టే

బాలీవుడ్‌ ప్రేమ జంట దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు ఎంతో కాలం నుంచి ప్రేమించుకుంటున్నారన్న సంగతి తెలిసిందే! ఇటీవలి కాలంలో వీరి ప్రేమ బ్రేకప్ అయిందన్న వార్తలు బాగా వినిపించాయి. అయితే అవన్నీ తప్పని నిరూపించిన సంఘటన ఇటీవల జరిగింది. వీరిద్దరూ ముంబాయిలోని ఓ రెస్టారెంటులో చేతిలో చేయ్యేసుకుని కనిపించారు. దీంతో వీరి బ్రేకప్‌కి బ్రేకులు పడ్డాయంటున్నారు సినీ జనాలు.


వీరి ప్రేమ మునుపటిలాగే గాఢంగా ఉందనీ, కాకపోతే కెరీర్‌ పరంగా అది అడ్డుగా మారే అవకాశముండడంతో కొంత కాలం విడిగా ఉండాలని నిర్ణయించుకున్నారట! కానీ ఎక్కువ కాలం దూరంగా ఉండలేకపోయారట. కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారట. ప్రేమ గాఢంగానే ఉంది. ఇక వీరిద్దరు పెళ్ళి చేసుకోవడమే తరువాయి అంటున్నారు సినీ జనాలు.

Advertisement
Advertisement
Advertisement