దిశా యాప్‌తో మహిళలకు భద్రత : సీఐ

ABN , First Publish Date - 2022-05-25T05:23:06+05:30 IST

మహిళలు, యువతకు రక్షణ కల్పించేందుకు దిశా యాప్‌ను మంగళవారం విస్తృతంగా మొబైల్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసినట్టు టుటౌన్‌ సీఐ డీవీ రమణ తెలిపారు.

దిశా యాప్‌తో మహిళలకు భద్రత : సీఐ
పెళ్లికుమార్తె మొబైల్‌లో దిశా యాప్‌ డౌన్‌లోడ్‌ చేయిస్తున్న టుటౌన్‌ ఎస్‌ఐ

ఏలూరు క్రైం, మే 24 : మహిళలు, యువతకు రక్షణ కల్పించేందుకు దిశా యాప్‌ను మంగళవారం విస్తృతంగా మొబైల్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసినట్టు  టుటౌన్‌ సీఐ డీవీ రమణ తెలిపారు. ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో యువతులు, మహిళల మొబైల్‌ ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు. టుటౌన్‌ ఎస్సై ఎన్‌ఆర్‌ కిశోర్‌బాబు బాలయోగి వంతెన సమీపంలో ఈ ప్రక్రియ చేపట్టారు. ఆ ప్రాంతానికి చెందిన ఒక యువతిని మంగళవారం ఉదయం పెళ్లి కూతుర్ని చేశారు. ఆ యువతి మొబైల్‌ ఫోన్లో కూడా దిశా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు. నగరంలోని పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో టుటౌన్‌ సీఐ అవగాహన కల్పించారు. యాప్‌ను ఎలా ఉపయోగించాలో తెలియజేశారు.దిశా యాప్‌ ఉంటే పోలీసులు మీతో ఉన్నట్లేనని స్పష్టం చేశారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడూ ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కాలని, పది నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారన్నారు. ఫోను బటన్‌ నొక్కలేని సమయంలో ఫోను ఐదు సార్లు అటు ఇటు కదిపితే సమాచారం దిశా యాప్‌ కంట్రోల్‌ రూంకు వెళుతుందని అక్కడ నుంచి పోలీసులు ఆ మొబైల్‌ వున్న ప్రాంతానికి చేరుకుంటారన్నారు. 



Updated Date - 2022-05-25T05:23:06+05:30 IST