‘దిశ’ యాప్‌కు ప్రత్యేక గుర్తింపు

ABN , First Publish Date - 2020-10-31T02:53:57+05:30 IST

మహిళల భద్రత కోసం రాష్ట్ర పోలీసు శాఖ ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్‌కు దేశంలో ప్రత్యేక గుర్తింపుతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి గోల్డ్‌ మెడల్‌ కూడా లభించిందని రాష్ట్ర హోం మంత్రి ఎం.సుచరిత అన్నారు.

‘దిశ’ యాప్‌కు ప్రత్యేక గుర్తింపు
అనకాపల్లిలో పట్టణ పోలీసు స్టేషన్‌ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న హోం మంత్రి ఎం.సుచరిత


కేంద్రం నుంచి గోల్డ్‌ మెడల్‌

ఏపీ పోలీస్‌ శాఖకు సగానికిపైగా అవార్డులు 

రాష్ట్ర హోం మంత్రి సుచరిత

అనకాపల్లి, నర్సీపట్నంలో నూతన పోలీసు స్టేషన్‌ భవనాలు ప్రారంభం


అనకాపల్లి, అనకాపల్లి టౌన్‌, నర్సీపట్నం టౌన్‌ అక్టోబరు 30: మహిళల భద్రత కోసం రాష్ట్ర పోలీసు శాఖ ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్‌కు దేశంలో ప్రత్యేక గుర్తింపుతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి గోల్డ్‌ మెడల్‌ కూడా లభించిందని రాష్ట్ర హోం మంత్రి ఎం.సుచరిత అన్నారు. అనకాపల్లిలో రూ.1.60 కోట్లతో నిర్మించిన పట్టణ పోలీసు స్టేషన్‌ భవనాన్ని, నర్సీపట్నం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో రూ.1.40 కోట్లతో నిర్మించిన మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పోలీసు సర్వీసులకు ఇచ్చే 83 అవార్డుల్లో 48 అవార్డులను సొంతం చేసుకున్న ఘనత ఏపీ పోలీసు శాఖదేనని, రెండు సంవత్సరాల్లో 103 అవార్డులు దక్కాయని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో 11 వేల మంది పోలీసులు తమ ప్రాణాలను ఫణంగాపెట్టి సేవలు అందించారని, దురదృష్టవశాత్తూ వీరిలో సుమారు 120 మంది కరోనాబారినపడి ప్రాణాలు కోల్పోయారన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరా మహిళల భద్రత కోసం రాష్ట్ర పోలీసు శాఖ ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్‌కు దేశంలో ప్రత్యేక గుర్తింపుతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి గోల్డ్‌ మెడల్‌ కూడా లభించిందని రాష్ట్ర హోం మంత్రి ఎం.సుచరిత అన్నారు. అనకాపల్లిలో రూ.1.60 కోట్లతో నిర్మించిన పట్టణ పోలీసు స్టేషన్‌ భవనాన్ని, నర్సీపట్నం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో రూ.1.40 కోట్లతో నిర్మించిన మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పోలీసు సర్వీసులకు ఇచ్చే 83 అవార్డుల్లో 48 అవార్డులను సొంతం చేసుకున్న ఘనత ఏపీ పోలీసు శాఖదేనని, రెండు సంవత్సరాల్లో 103 అవార్డులు దక్కాయని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో 11 వేల మంది పోలీసులు తమ ప్రాణాలను ఫణంగాపెట్టి సేవలు అందించారని, దురదృష్టవశాత్తూ వీరిలో సుమారు 120 మంది కరోనాబారినపడి ప్రాణాలు కోల్పోయారన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ ఏపీ పోలీస్‌ శాఖ శాంతి భద్రతల పరిరక్షణలో ముందుంటుందని అన్నారు. ఏ విపత్తు సంభవించినా... ప్రజలకు మొదట గుర్తుకు వచ్చేది పోలీసులేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్‌ (అనకాపల్లి), పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ (నర్సీపట్నం), రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌, విశాఖ రేంజి డీఐజీ రంగారావు, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ మౌర్య, వైసీపీ అనకాపల్లి పార్లమెంట్‌ పరిశీలకుడు దాడి రత్నాకర్‌, డీఎస్‌పీలు శ్రావణి, మళ్ల మహేశ్‌, శ్రీనివాసరావు, కుమారస్వామి, సీఐలు ఎల్‌.భాస్కరరావు, పీవీవీ నరసింహారావు, బాబూజీ, వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్‌కుమార్‌, మందపాటి జానకిరామరాజు, పలకా రవి, కోరుకొండ రాఘవ, ఆళ్ల నాగేశ్వరరావు, జాజుల రమేశ్‌, గొర్లి సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు. 

‘పట్నంలో మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే గణేశ్‌

నర్సీపట్నంలో మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌, హోం మంత్రి సుచరితకు వినతి పత్రం అందజేశారు. నర్సీపట్నం, చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు ఫిర్యాదు చేయడానికి అనకాపల్లి వరకు వెళ్ల లేకపోతున్నారని, అందువల్ల ఇక్కడ ప్రత్యేకంగా మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. 


Updated Date - 2020-10-31T02:53:57+05:30 IST