అమరావతి: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరద ప్రభావిత గ్రామాల్లో వైసీపీ నేతలకు పరాభవం ఎదురయింది. పరామర్శకు వెళ్లిన వైసీపీ నేతలపై స్థానికులు మండిపడ్డారు. నష్టపోయిన తర్వాత పర్యటనకి వస్తారా అంటూ వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మంత్రి బాలినేని, ఎమ్మెల్యే ప్రసన్న, కలెక్టర్ చక్రధర్‌కు నిరసన సెగ తగిలింది. పోలీసుల సాయంతో అక్కడ నుంచి మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ జారుకున్నారు.
కడప జిల్లా పాటూరులో మేడా విజయభాస్కర్‌రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులను, వైసీపీ నేతలను వరద బాధితులు నిలదీశారు. ఐదు రోజులుగా తాగునీటికి నోచుకోలేకున్నామని స్థానికులు మండిపడ్డారు.