ఏజెన్సీలో పశువుల వ్యాధుల నివారణకు చర్యలు

ABN , First Publish Date - 2022-05-24T06:28:37+05:30 IST

ఏజెన్సీలో పశువుల వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టినట్లు ఐటీడీఏ పీవో సూరత్‌ ధనుంజయ్‌ చెప్పారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం పశువులకు అత్యవసర సేవల నిమిత్తం మొబైల్‌ వాహనాన్ని ప్రారంభించారు.

ఏజెన్సీలో పశువుల వ్యాధుల నివారణకు చర్యలు

రంపచోడవరం, మే 23: ఏజెన్సీలో పశువుల వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టినట్లు ఐటీడీఏ పీవో సూరత్‌ ధనుంజయ్‌ చెప్పారు.  స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం పశువులకు అత్యవసర సేవల నిమిత్తం మొబైల్‌ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ పశువులకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు  1962కు ఫోన్‌ చేయాలని సూచించారు. మొబైల్‌ వాహనంలో వైద్యాధికారి, వెటర్నరీ అసిస్టెంట్‌ అందుబాటులో ఉంటారన్నారు. అదే విధంగా ఏజెన్సీలో పాల ఉత్పత్తి కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రమేష్‌నాయక్‌, వైద్యాధికారులు సాయికృష్ణ, రవిచంద్రదేవ్‌, గోపిక, వెటర్నరీ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T06:28:37+05:30 IST