వ్యాధులు ఫుల్‌..వైద్యం నిల్‌..!

ABN , First Publish Date - 2022-08-13T04:43:41+05:30 IST

మార్కాపురం ప్రాంతంలో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో మార్కాపురం జిల్లా వైద్యశాల, పట్టణంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో నమోదవుతున్న ఔట్‌ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకూ పెరు గుతోంది.

వ్యాధులు ఫుల్‌..వైద్యం నిల్‌..!
ఒకే బెడ్‌పై వైద్యం పొందుతున్న ఇద్దరు రోగులు

డాక్టర్ల కొరత .. జ్వరాలతో రోగుల వెత

 7 డెంగ్యూ కేసులు నమోదు

మార్కాపురం, ఆగస్టు 12 : మార్కాపురం ప్రాంతంలో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో మార్కాపురం జిల్లా వైద్యశాల, పట్టణంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో నమోదవుతున్న ఔట్‌ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకూ పెరు గుతోంది. అయితే డాక్టర్ల కొరత కారణంగా అరకొర సేవలు అందుతున్నాయి. ప్రభుత్వ వైద్యశాలలో వైరల్‌ జ్వరాలకు నివారణకు అవసరమైన మేర మందులు ఉన్నప్పటికీ ప్రజలు ప్రైవేటు వైద్యశాలల దారి పడుతున్నారు. 

ప్రభుత్వం డాక్టర్ల నియామకంలో జాప్యం, డాక్టర్ల బదిలీల నేపథ్యంలో  కొరత ఏర్పడింది. దీంతో రోగులు గ్రామస్థాయిలో ఉన్న ఆర్‌ఎంపీలు,  ప ట్టణంలో ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు.

మార్కాపురం ప్రాంతంలో ఇటీవల కాలంలో ఏడు డెంగ్యూ కేసులు న మోదయ్యాయి. మార్కాపురం పట్టణంలో మూడు, వై.పాలెం, కంభం, తర్లు పాడు, గజ్జలకొండలలో ఒక్కొక్కటి చొప్పున డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 

ఒకే బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు

వసతుల లేమితో ఇబ్బంది పడుతున్న రోగులు

గిద్దలూరు : గిద్దలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో సేవ చేసేందుకు వైద్యు లు, సిబ్బంది ఉన్నప్పటికీ వసతులు మాత్రం లేవు. పాత భవనాన్ని పడగొట్టి కొత్త భవన నిర్మాణం జరుగుతుండడంతో ఉన్న కొద్దిపాటి గదుల్లోనే రోగులకు సేవలందుతున్నాయి. ఇటీవల వాతావరణ మార్పుతో జ్వర బాధితుల సంఖ్య పెరిగింది. ఆసుపత్రికి వచ్చే రోగులు వసతులు లేక ఇబ్బంది పడుతుండడం ఆంధ్రజ్యోతి పరిశీలనలో శుక్రవారం కనిపంచింది.  ఒక్కో బెడ్‌పై ఇద్దరు, మరికొన్ని బెడ్లపై ముగ్గురిని ఉంచి  చికిత్సలు అందిస్తున్నారు. అందరికీ సెలైన్‌ పె ట్టడంతో స్థలంలేక కొందరు పడుకుని సెలైన్‌ పెట్టించుకోగా మరికొందరు విధిలేక కూర్చునే సెలైన్‌ పెట్టించుకుని కనిపిం చింది. ఆసుపత్రిలోని బెడ్లన్నీ ఎక్కువ భాగం జ్వరబాధితులతోనే నిండిపోయాయి. నిత్యం 250 నుంచి 300 వరకు ఓపీ వస్తుండగా,  80 మందికి పైగా గత వారం నుంచి జ్వరంతో వ స్తున్నవారే. ఎక్స్‌రే ప్లాంటును వినియోగించలేక పోవడంతో రోగులు ప్రైవేటు కేంద్రాలకు వెళ్లడం కన్పించింది. తగినంత  ఓపీ రూములు  లేకపోవడంతో చెట్ల కింద  సిమెంటు బెంచీలపై రోగులు కూర్చుంటున్నారు. డాక్టర్ల పిలుపు కోసం ఎదురు  చూస్తున్నారు. త్వరితగతిన భవన నిర్మాణం పూర్తి చేసి రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అక్కడ 2 గంటలే సేవలు

రాచర్ల : ప్రభుత్వాసుపత్రిల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందు తున్నాయి. మండలంలోని పాలకవీడు పంచాయతీ పరిధిలో గల అనుమలవీడు గ్రామంలోని 24 గంటల ప్రభుత్వ ఆసుపత్రిలో  2 గంటలు మాత్రమే సేవలు అందుబాటులో ఉన్నాయి. 24 గంటల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో సహా సిబ్బంది అందుబాటులో ఉండాల్సి ఉండగా అక్కడ కేవలం 2 గం టలు మాత్రమే సిబ్బంది ఉండి వెళ్లిపోతున్నారు. శుక్రవారం ఆంధ్రజ్యోతి పరి శీలించగా ఇద్దరు వైద్యులు ఉండగా ఒక మహిళా డాక్టర్‌ కేవలం 10గంటలకు వచ్చి 12గంటల వరకు  ఓపీ చూసి వెళ్లిపోయారు.  మరో వైద్యాధికారి కూడా కొద్దిసేపు కూర్చుని రోగులు లేరని వెనుదిరిగారు. మొత్తం మీద 60 మందికి మాత్రమే ఓపీ చూశారు. 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ఈ  ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు  గర్భిణులకు మాత్రమే కాన్పులు అయినట్లు రి కార్డులో నమోదైంది. ఎ క్కువగా ఈ ఆసుపత్రి పరిధిలోని గ్రామాల్లోని ఏ ఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు గర్భిణులకు ప్రభుత్వ ఆ సుపత్రికి తీసుకువచ్చి కా న్పులు చేయాల్సి ఉండగా, సి బ్బందే ప్రైవేటు ఆసుపత్రుల కు ఎక్కువగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత

పొదిలి రూరల్‌ :  పొదిలి 30 పడకల ప్రభుత్వాసు పత్రిలో డాక్టర్లు, సి బ్బంది కొరత  రోగులను వేధిస్తోంది. దీంతో వైద్య సేవలు అంతంతమాత్రం గానే అందుతున్నాయి. పరికరాలు కూడా లేకపోవడం మరో సమస్య.  ఉన్నముగ్గురు డాక్టర్లతోనే మమ అనిపిస్తున్నారు. రోజు 200 ఓపీ లుంటాయి.  నెలకు సుమారు 20కి పైగా కాన్పులు జరుగుతుంటాయి.  ఆప రేషన్‌ చేసేం దుకు పరికరాలు లేవు. దీంతో రోగులను ఒంగోలుకు తరలి స్తారు.  ఎక్స్‌రే, స్కానింగ్‌, ల్యాబ్‌, డిజిటల్‌ ఎక్స్‌రే పరికరాలు మూలనప డ్డాయి. ఉప్పలపాడు  పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులతో కలిపి 17 మంది సిబ్బంది ఉండాలి. ఒక పోస్ట్‌ మాత్రమే ఖాళీగా ఉందని వైద్యాధికారి సుష్మా తెలిపారు.  

డెంగ్యూ, టైఫాయిడ్‌ పరీక్షలకు కిట్లే లేవు

ఎర్రగొండపాలెం : వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్‌ రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో వస్తున్న రోగులకు పరీక్షించే డెంగ్యూ, టైఫాయిడ్‌ కిట్లు ఆసుపత్రిలో లేవు. ప్రభుత్వాసుపత్రిలో రోజుకు 30 నుంచి 40 మంది పైగా జ్వరబాధితులు చికిత్స పొందుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడం లేదని, దోమల కారణంగా జ్వరాలు వచ్చాయని ఆంధ్రజ్యోతి వద్ద పలువురు వాపోయారు.  రక్తపరీక్షల కోసం ప్రైవేటు కేంద్రాలకు వెళ్తున్నామని, ఒక్కో టెస్టుకు రూ.200 తీసుకుంటున్నారని పేద రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఐదు రోజులుగా డెంగ్యూ జ్వరంతో ఇక్కడే ఉన్నామని ముటుకులకు చెందినవారు తెలిపారు. జనరల్‌ వార్డు లేకపోవడంతో ఎక్కువ మంది ఓపీ చికిత్స పొంది వెళ్తున్నారు. 

వసతులు కరువు 

పెద్ద దోర్నాల : మండలంలో సీజనల్‌ వ్యాధుల్లో భాగంగా జ్వరం, జలుబుతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురవక పోయినా చిరు జల్లులకే సీజనల్‌ వ్యాధులు వచ్చిపడ్డాయి. జ్వరం, జలుబు వంటినొప్పులతో ప్రజలు బాధపడుతున్నారు. దోర్నాలలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం, చింతల, కొర్రప్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. దోర్నాల వైద్యశాలకు రోజుకు 130 నుంచి 180 మంది వరకు ఓపీ ఉంటుంది. జనరల్‌ మెడిసన్‌ రామలక్ష్మి డిప్యుటేషన్‌లో అమరావతి వెళ్లగా, గైనకాలజిస్ట్‌ వసంతకుమారి మెటర్నటీ లీవ్‌లో ఉన్నా రు. బ్లడ్‌ బ్యాంకు లేని కారణంగా ప్రమాదాలు జరిగిని వారికి అత్యవసరసేవలు  అందడం లేదు. రోగులకు పూర్తి స్థాయి వైద్యం అందించేందుకు తగిన వసతులు లేవు. నూతనంగా మంజూరైన భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా గ్రామాల్లో మురికి కాలువలు లేవు. అంతర్గత రహదారులు అస్తవ్యస్తంగా ఉండి మురికినీరు నిల్వ చేరడంతో దోమలు, ఈగలు వ్యాప్తికి జ్వరాలు వచ్చినట్లు ప్రజలు చెప్తున్నారు.  

సెలైన్‌ కావాలంటే కొనాల్సిందే..!

బేస్తవారపేట (కంభం) : రోగ మొచ్చి కంభం ఆసుపత్రికి వెళితే.. మాత్రలతో సరిపెడుతున్నారని రోగులు వాపోతు న్నారు. జ్వరం వచ్చి నీరసించిపోతే సెలైన్‌ అవసర మైతే బయట కొనుక్కోవాలని రోగులు చెప్తున్నారు. కంభం, బేస్త వారపేట, అర్ధవీడు మండలాలకు చెందిన ప్రజలు జ్వరమొస్తే కంభం ప్రభుత్వ ఆసుపత్రికి పరుగు తీస్తారు. నిత్యం రోగులతో కిటకిటలాడే ఈ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉంది. దీంతో రోగులకు మెరుగైన సేవలు అం దడం లేదు. శుక్ర వారం ఆంధ్రజ్యోతి పరిశీలనలో రోగుల ఇబ్బం దులు కన్పించాయి. 

Updated Date - 2022-08-13T04:43:41+05:30 IST