పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

ABN , First Publish Date - 2022-05-26T05:23:55+05:30 IST

తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ
చాకలి ఐలమ్మ, గంగమ్మ దేవత విగ్రహాల ఆవిష్కరణలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- చాకలి ఐలమ్మ, గంగమ్మ దేవత విగ్రహాల ఆవిష్కరణ

గద్వాల, మే 25 : తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని బీరెల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్వతిరేకంగా పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్‌ అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. డ్రై క్లీనింగ్‌, ల్యాండ్రీ షాపులకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. త్వరలో దోభీ ఘాట్‌ నిర్మిస్తామన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి ఆలజడి సృష్టిస్తున్న వారికి భయపడాల్సిన పనిలేదన్నారు. కార్యక్రమంలో రజక సంఘం జాతీయ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌, జములమ్మ ఆలయ కమిటీ సభ్యుడు చాకలి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


ముదిరాజ్‌ల ఆరాధ్య దేవత గంగమ్మ

ముదిరాజ్‌ల ఆరాధ్య దేవత గంగమ్మ అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బీరెల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన గంగమ్మ దేవత విగ్రహావిష్క రణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం వాహనాలు, చేపలు పట్టే సామగ్రిని అంది స్తోందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో చేపలు విక్ర యించుకునేందుకు ఆటోలు అందించినట్లు చెప్పారు. మత్స్యకారులకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించామని తెలిపారు. బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలని సంఘం సభ్యులు కోరగా, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు సుబాన్‌, సర్పంచు జయమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు రాధమ్మ, నాయకులు రమేష్‌ నాయుడు, నీలేశ్వర్‌రెడ్డి, బీచుపల్లి, భగీరథ వంశీ పాల్గొన్నారు.


బీజేపీ నాయకుల ప్రత్యేక పూజలు

బీరెల్లి గ్రామంలో బుధవారం ఆవిష్కరించిన చాకలి ఐలమ్మ, గంగమ్మ దేవత విగ్రహాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి దర్శించుకొన్నారు. ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. గంగమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుల సంఘాల నాయకులు వారిని ఘనంగా సన్మానించారు.

Updated Date - 2022-05-26T05:23:55+05:30 IST