చిన్నారుల్లో నైపుణ్యాన్ని వెలికితీయడం అభినందనీయం

ABN , First Publish Date - 2022-05-25T05:23:12+05:30 IST

చిన్నారుల్లో నైపుణ్యాన్ని వెలికితీయడం అభినందనీయం

చిన్నారుల్లో నైపుణ్యాన్ని వెలికితీయడం అభినందనీయం

తాండూరు, మే 24 : వేసవి సెలవుల్లో చిన్నారుల కోసం నటరాజ నృత్య అకాడమీ ఆధ్వర్యంలో సమ్మర్‌ క్యాంపు నిర్వహిస్తూ.. వారిలోని నైపుణ్యాన్ని వెలికితీయడం అభినందనీయమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న అన్నారు. నటరాజ నృత్య అకాడమీ నిర్వాహకులు, డాన్స్‌ మాస్టర్లు వాణి, సౌమ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమ్మర్‌ స్పెషల్‌ క్యాంపులో పాల్గొని మాట్లాడుతూ.. మన సంస్కృతిలో భాగంగా నృత్యాలను ఆదరించి, ప్రోత్సహించడం ఎంతైనా అవసరమని అన్నారు. వికారాబాద్‌ జడ్పీటీసి ప్రమోదినీరెడ్డి మాట్లాడుతూ.. సంస్కృతిసంప్రదాయాలను గౌరవిస్తూ చిన్నారులకు భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్యాలను నేర్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల దీప, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కల్వ సుజాత, పోట్లి మహరాజ్‌ దేవస్థానం చైర్మన్‌ రాజన్‌గౌడ్‌, అంతారం సర్పంచ్‌ రాములు, మహిళా సమాఖ్య నాయకురాలు శకుంతల, నాయకులు రాందాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:23:12+05:30 IST