రంగు మారిన వరిచేను!

ABN , First Publish Date - 2021-10-22T05:16:28+05:30 IST

ఓ రైతు మతిమరుపు కారణంగా రెండున్నర ఎకరాల్లో వరి పంటను నష్టపోయిన సంఘటన దబ్బగెడ్డ గ్రామంలో చోటుచేసుకుంది.

రంగు మారిన వరిచేను!
గడ్డిగా మారిన వరిపంటను పరిశీలిస్తున్న ఏవో

  పురుగు, కలుపు మందులను కలిపి పిచికారీ చేసిన వైనం

  రెండున్నర ఎకరాల్లో  పంట నష్టం

మక్కువ: ఓ రైతు మతిమరుపు కారణంగా రెండున్నర ఎకరాల్లో వరి పంటను నష్టపోయిన సంఘటన దబ్బగెడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దబ్బగెడ్డ గ్రామానికి చెందిన పువ్వల రమణ అనే రైతు నెల రోజుల క్రితం వరి పంటకు స్వల్ప దోమపోటు, తెగుళ్లు వచ్చాయనే కారణంతో పురుగుల మందును, ఆయిల్‌పామ్‌ తోటలో కలుపు నివారించేందుకు కలుపు మందును ఒకే రోజు కొనుగో లు చేశాడు. ఇటీవల వర్షాలు కురవడంతో మందులు పిచికారీ చేయటానికి అదును లేకపోవడంతో ఇంటి వద్దే ఉంచేశాడు. వరి చేను పొట్ట దశకు చేరుకున్న నేపథ్యం లో మంగళవారం ఉదయాన్నే వరి చేనుకు పురుగు మందుతో పాటు కలుపు మందును కలిపి పిచికారీ చేశాడు. మరుసటి రోజు పొలం మాడిపోవటాన్ని తన అన్నయ్య చూసి, రమణకు తెలియజేశాడు. దీంతో రమణ కుటుంబం బోరున విలపిస్తూ పొలం వైపు పరుగులు తీశారు. ఒకే సంచిలో రెండు మందులు కలిపి తెచ్చిన విషయాన్ని మరిచిపోయానని బోరున విలపించాడు. గడ్డిగా మారిన వరి పంటను ఏవో కె.తిరు పతిరావు గురువారం పరిశీలించారు. రైతులు రసాయనిక మందులు వినియోగిం చినప్పుడు ఆర్బీకేల్లో సిబ్బంది సలహాలు తీసుకోవాలని సూచించారు. సుమారు రెండు న్నర ఎకరాల్లో వరి పైరు పూర్తిగా గడ్డిగా మారటంతో సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.



 

Updated Date - 2021-10-22T05:16:28+05:30 IST