కరోనా దెబ్బకు శ్రమజీవుల విలవిల

ABN , First Publish Date - 2020-04-10T11:00:16+05:30 IST

కరోనా దెబ్బకు శ్రమజీవులు విలవిల్లాడుతున్నారు. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతనెల 23వ తేదీ నుం చి ఈనెల 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌ విధించాయి.

కరోనా దెబ్బకు శ్రమజీవుల విలవిల

కుల వృత్తిదారులకు ఉపాధి కరువు

భవన నిర్మాణ  పనుల నిలిపివేత

అల్లాడుతున్న దినసరి కూలీలు, కార్మికులు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కరోనా దెబ్బకు శ్రమజీవులు విలవిల్లాడుతున్నారు. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతనెల 23వ తేదీ నుం చి ఈనెల 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌ విధించాయి.  దీంతో ప్రజా రవాణాను నిలిపివేయడంతో పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లు, సినిమాహాళ్లు, తదితర అన్నింటినీ బంద్‌ చేశారు. మెడికల్‌, కిరాణా షాపులు, కూరగాయ లు, పండ్ల దుకాణాలు మినహా అన్నింటినీ మూసివేశారు. వ్యవసాయ పను లకు అనుమతివ్వడంతో పాటు నిత్యావసరాలనుఉత్పత్తిని నిలిపి వేయలేదు. రైసు, నూనె మిల్లులను నడుపుతుండగా, ఆయా పరిశ్రమలను మూసివేశా రు. వివిధ దుకాణాల్లో పనిచేసే వారికి పనిలేకుండా పోయింది. ఈ సమ యంలో వారికి వేతనాలు వచ్చే పరిస్థితి కనబడడం లేదు. 


ప్రధానంగా భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జిల్లాలో వేలాది మంది జీవిస్తున్నారు. ఒక్కో మేస్త్రీ రోజుకు 800 నుంచి వెయ్యి రూపాయల వరకు కోల్పోతుండగా, కూలీలు 300నుంచి 500 రూపాయలు కోల్పోతున్నారు. అడ్డా కూలీల పరిస్థితి దయనీయంగా ఉన్నది. అలాగే కుల వృత్తులపై ఆధా రపడ్డ పలువురికి ఉపాధి లేకుండా పోయింది. క్షౌర వృత్తిని చేపట్టే నాయీ బ్రాహ్మ ణుల దుకాణాలను కూడా మూసివేయడంతో వారికి 18 రోజులుగా పని లేకుండాపోయింది. అన్ని ఖర్చులు పోనూ ఒక్కొక్కరు 500 నుంచి 800 రూ పాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తున్నది. అంతకుముందు షాపులకు వెళ్లి గడ్డాలు గీయించుకున్న వాళ్లు లాక్‌డౌన్‌తో సొంతంగా గడ్డం గీసుకు నేందుకు అలవాటుపడ్డారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అలాంటి వారిలో గడ్డాలు గీయించుకునేందుకు షాపులకు సగం మంది కూడా వచ్చే అవకా శాలు లేవని నాయీబ్రాహ్మణులు ఆందోళన చెందుతున్నారు. వేరే ఏదైనా పని చేసుకుందామంటే ఎక్కడా కూడా పనులు దొరికే పరిస్థితులు లేవని నాయీబ్రాహ్మణులు అంటున్నారు. షాపులు తెరవలేని పరిస్థితి ఉండడంతో అద్దెభారం కూడా పెరగనున్నదని వాపోతున్నారు. 


అలాగే రజకులు ఆ పనులు చేయడం లేదు. అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో ఇస్త్రీ బట్టలను చాలా మంది ఇళ్లలోనే చేసుకుంటుండడంతో లాం డ్రీ షాపులు నడిపే వారికి కూడా పని లేకుండాపోయింది. ప్రజా రవాణాను నిలిపివేయడంతో ఆటోడ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, యజమానులకు కూడా పని లేకుండాపోయింది. లాక్‌డౌన్‌కు ముందు ప్రతి కుటుంబ నిర్వహణకు అయ్యే ఖర్చు ప్రస్తుతం పెరిగిపోయింది. మార్కెట్‌లో కూరగాయలు, నిత్యావసరాలు, పండ్ల ధరలు పెంచడంతో మరింత భారం పెరుగుతున్నది. లాక్‌డౌన్‌ ఈనెల 14వ తేదీ తర్వాత కూడా ఎత్తివేసే పరిస్థితి కనబడడం లేదు. కరోనా వైరస్‌ను పూర్తిగా నివారించిన తర్వాతనే లాక్‌డౌన్‌ను ఎత్తివేసే ఆలోచనతోనే ప్రభుత్వాలున్నాయి. లాక్‌డౌన్‌ కొనసాగిస్తే ఆయా వర్గాలు, పరిశ్రమలను న డుపుకునేందుకు షరతులు విధించి అనుమతిస్తే పలువురికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. భవన నిర్మాణ రంగ పనుల విషయంలో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా అవకాశం కల్పిస్తే వారికి కొంతమేరకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2020-04-10T11:00:16+05:30 IST