డిస్కో డ్యాన్స్ ఎలా స్టార్ట్ అయ్యింది? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?

ABN , First Publish Date - 2022-02-19T15:10:04+05:30 IST

'ఐయామ్ ఎ డిస్కో డాన్సర్...' పాట విన్న మీకు...

డిస్కో డ్యాన్స్ ఎలా స్టార్ట్ అయ్యింది? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?

'ఐయామ్ ఎ డిస్కో డాన్సర్...' పాట విన్న మీకు డిస్కో డాన్స్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. డిస్కోలో ఓ ప్రత్యేకమైన సంగీతం ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. దానికి అనుగుణంగా డిస్కో డ్యాన్స్ చేస్తారు. అయితే ఈ డిస్కో డ్యాన్స్ ఎక్కడ నుండి వచ్చింది? ఇంతకీ డిస్కో అంటే ఏమిటి? దీని గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలని అనుకున్నారా? ఆ వివరాలు ఇప్పుడు మీకోసం తెలియజేస్తున్నాం. డిస్కో అనే పదం ఫ్రెంచ్ పదం డిస్కోథెక్ నుండి ఉద్భవించింది, దీని అర్థం 'ఫోనోగ్రాఫ్ రికార్డుల గ్రంథాలయం'. ఇంగ్లీషులో డిస్కోథెక్ అర్థం అదే. ఫ్రెంచ్‌లో డిస్కోథెక్ అనే పదాన్ని నైట్‌క్లబ్‌ల కోసం ఉపయోగించారని చరిత్ర చెబుతోంది. నాజీల పాలనలో కూడా ఇది ఉండేదని చెబుతుంటారు. 


దీని ప్రకారం చూస్తే డిస్కో అనేది ఫ్రెంచ్ నుండి ఉద్భవించిందని చెప్పవచ్చు. దీని తర్వాత 1964లో, పొట్టి స్లీవ్‌లెస్ దుస్తులకు 'డిస్కోథెక్ డ్రెస్' అని పేరు వచ్చింది, ఇది అమెరికాలో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. దీని తరువాత దీనికి డిస్కో అనే పేరు వచ్చింది. డిస్కో అనే పదం డిస్క్ నుండి ఉద్భవించిందంటూ ఇంటర్నెట్‌లో కొన్ని వాదనలు కూడా వినిపిస్తాయి. పాటలు రికార్డ్ చేసిన ప్లాస్టిక్ రికార్డ్‌ను డిస్క్ అని కూడా అంటారు. డెబ్బైలలో ఇటువంటి క్లబ్‌లు ఏర్పడ్డాయి. ఇక్కడ ఈ పాటల రికార్డులను వినోదం కోసం ప్లే చేసేవారు. దీనికి అనుగుణంగా అక్కడున్నవారు నృత్యం చేసేవారు. ఈ క్లబ్‌లను డిస్కోథెక్‌లు అని పిలుస్తారు. డిస్కో సంగీతంపై చేసే నృత్యాన్ని డిస్కో అంటారు. దీని తర్వాత, 1970 సంవత్సరంలో డిస్కో డ్యాన్స్ ట్రెండ్‌లోకి వచ్చింది. ఈ సమయంలోనే సాటర్డే నైట్ ఫీవర్ అనే సినిమా వచ్చిందని, దాని వల్ల చాలా డిస్కోకు మరింతగా పేరు వచ్చిందని చెబుతారు. ఫేమస్ డిస్కో డ్యాన్స్ గురించి ప్రస్తావించాల్సివస్తే.. ఐ లవ్ ది నైట్ లైఫ్, వి ఆర్ ఫామిలీ, ఐ విల్ సర్వైవ్, ఐయామ్ యువర్ బూగీ మ్యాన్, షేక్ యువర్ బూటీ, డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్, ఇట్స్ ఎ డిస్కో నైట్ పాటలు డిస్కో డ్యాన్స్‌ పాటలుగా ప్రసిద్ధి చెందాయి. డిస్కో డ్యాన్స్‌లో అమ్మాయిలు స్ట్రెయిట్ జీన్స్, టైట్ స్కర్ట్స్, జాకెట్లు, సిల్క్ డ్రెస్‌లు, హైహీల్స్, కాస్ట్యూమ్ జ్యువెలరీ మొదలైనవి ధరిస్తారు. అదే సమయంలో, అబ్బాయిలు ముదురు స్లిమ్ ప్యాంటు, త్రీ పీస్ సూట్లు, లెదర్ ప్యాంట్లు, జాగింగ్ సూట్లు మొదలైనవి ధరిస్తారు. ఇది ఫ్రీస్టైల్ డ్యాన్స్ మాత్రమే. ఇందులో మీ శరీరాన్ని బీట్ ప్రకారం కదిలించాలి. కొన్ని స్టెప్స్ తరువాత వాటినే తిరిగి రిపీట్ చేయాలి. చాలా మంది డిస్కోలో పెదాలను కదిలించరు. 


Updated Date - 2022-02-19T15:10:04+05:30 IST