Abn logo
Feb 22 2020 @ 03:26AM

పీసీసీకి 11 మంది ఉపాధ్యక్షులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ ఆఫీస్‌ బేరర్లు, డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమించింది. 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శులతో ఆఫీస్‌ బేరర్ల జాబితాను ప్రకటించింది.  సమన్వయ కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీల నియామకంతో పాటు అన్ని జిల్లాలకు అధ్యక్షులను కూడా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌ శుక్రవారం ఢిల్లీలో ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ చైర్మన్‌గా 25 మంది నేతలతో సమన్వయ కమిటీని ప్రకటించారు. ఇందులో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టి. సుబ్బిరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, సీడీ మెయ్యప్పన్‌, క్రిస్టోఫర్‌ తిలక్‌, కొప్పుల రాజు, ఎం.ఎం.పళ్లంరాజు, సాయిప్రతాప్‌, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు, చింతా మోహన్‌, తులసిరెడ్డి, షేక్‌ మస్తాన్‌వలీ, గిడుగు రుద్రరాజు, శ్రీవెళ్ల ప్రసాద్‌, సీవీ శేషారెడ్డి, లింగంశెట్టి ఈశ్వరరావు, ఎం.జె.సూర్యనాయక్‌, పి.కమలమ్మ, ఎం.జె.రత్నకుమార్‌, సుంకర పద్మశ్రీ, కేబీఆర్‌ నాయుడు. ఇందులో ఎన్‌ఎ్‌సయూఐ, యువజన కాంగ్రెస్‌, మహిళా కాంగ్రెస్‌, సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉంటారు. 12 మందితో ఏర్పాటు చేసిన రాజకీయ వ్యవహారాల కమిటీకి పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ చైర్మన్‌గా ఉంటారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీరారెడ్డి, పళ్ల్లంరాజు, కొప్పుల రాజు, చింతా మోహన్‌, తులసిరెడ్డి, మస్తాన్‌వలీ, జంగా గౌతమ్‌, కొరివి వినయ్‌కుమార్‌, సాజహాన్‌ బాషా, పి.రమణకుమారి సభ్యులు. ఉపాధ్యక్షులుగా షాజహాన్‌ బాషా, జంగా గౌతమ్‌, యడ్ల ఆదిరాజు, ఎస్‌.ఎన్‌.రాజా, శృతీదేవి, మార్టిన్‌ లూథర్‌, గంగాధర్‌, మురళి ధనేకుల, వేణుగోపాల్‌రెడ్డి, జె.ప్రభాకర్‌, శ్రీపతి ప్రకాశరావు నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా డోలా జగన్మోహన్‌, జమ్ము ఆదినారాయణ, జి.నారాయణ రావు, పాచిపెంట శాంతకుమారి, బొడ్డుముచ్చి శ్రీనివాసరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, అమర్జాహ్‌ బేగ్‌ మహమ్మద్‌, పి.హరికుమార్‌ రాజు, పరసా రాజీవ్‌ రతన్‌, గార ఉషారాణి, చిలకా విజయ్‌కుమార్‌, చెరువు శ్రీధర్‌రెడ్డి, వై.సుమతిరెడ్డి, చింతల మోహన్‌రావు, జగన్మోహన్‌రెడ్డి, లక్ష్మీనారాయణన్‌, మదనమోహన్‌రెడ్డి, డి.రాంభూపాల్‌రెడ్డి నియమితులయ్యారు. 


డీసీసీ అధ్యక్షులు..

బొడ్డేపల్లి సత్యవతి(శ్రీకాకుళం), సరగడ్డ రమేశ్‌ కుమార్‌(విజయనగరం), శ్రీరామమూర్తి(అనకాపల్లి), పాండురంగారావు(కాకినాడ రూరల్‌), కొత్తూరి శ్రీనివాస్‌(అమలాపురం), ఎన్‌వీ శ్రీనివాస్‌(రాజమండ్రి రూరల్‌), మరినేడి శేఖర్‌ (నరసాపురం), జెట్టి గురునాథం(ఏలూరురూరల్‌), లాం తాంతియాకుమారి (మచిలీపట్నం), కిరణ్‌ బొర్రా(విజయవాడ రూరల్‌), జి.అలెగ్జాండర్‌ సుధాకర్‌ (నరసరావుపేట), ఇ.సుధాకర్‌రెడ్డి (ఒంగోలు రూరల్‌),  లక్ష్మీనరసింహా యాదవ్‌ (నంద్యాల), అహ్మద్‌ అలీ ఖాన్‌ (కర్నూలు రూరల్‌), ఎస్‌.ప్రతాపరెడ్డి(అనంతపురంరూరల్‌), కె.సుధాకర్‌ (హిందూపురం), దేవకుమార్‌రెడ్డి (నెల్లూరు రూరల్‌), డాక్టర్‌ సురేశ్‌బాబు (చిత్తూరు).

Advertisement
Advertisement
Advertisement