అతివేగంతో అనర్థం

ABN , First Publish Date - 2022-05-22T06:14:21+05:30 IST

చింతకొమ్మదిన్నె- ఆల్ఫా కాలేజీ మధ్య 40వ జాతీయ రహదారిలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సి. బెళగల్‌ మండలం పొలకల్‌ గ్రామానికి చెందిన రాముడు (45) అక్కడికక్కడే మృతి చెందాడు.

అతివేగంతో అనర్థం

బోలేరోను ఢీ కొన్న లారీ

ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి


ఆళ్లగడ్డ, మే 21: చింతకొమ్మదిన్నె- ఆల్ఫా కాలేజీ మధ్య 40వ జాతీయ రహదారిలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సి. బెళగల్‌ మండలం పొలకల్‌ గ్రామానికి చెందిన రాముడు (45) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో పోలకల్‌కు చెందిన మద్దిలేటి, గుడూరు మండలం మునగాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సి. బెళగల్‌ మండలం పొలకల్‌ గ్రామానికి చెందిన  రాముడు, మద్దిలేటి, మహేష్‌, గూడూరు మండలం మునగాల గ్రామానికి చెందిన డ్రైవరు వెంకటేశ్వర్లు బర్రెలను మైదుకూరులో అమ్ముకునేందుకు ఏపీ 21 టీఈ 0731 నంబరు గల బోలేరో వాహనంలో శుక్రవారం అర్ధరాత్రి  బయలు దేరారు. వీరు కాలకృత్యాలు తీర్చుకుందామని ఆళ్లగడ్డ మండలంలోని ఆల్ఫా కాలేజీ- చింతకొమ్మదిన్నె గ్రామం మధ్య రోడ్డు పక్కన వాహనాన్ని నిలబెట్టారు. అదే మార్గంలో హైదరాబాదు నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఏపీ39 యూసీ 6308 నంబరుగల 14 టైర్ల ఐసర్‌ లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాముడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయన శరీరం తునాతునకలు కావడాన్ని బట్టి ప్రమాద తీవ్రత తెలుస్తోంది. మద్దిలేటి, డ్రైవరు వెంకటేశ్వర్లు గాయపడ్డాడు. వీరిని మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మహేష్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ నరసింహులు శనివారం చెప్పారు.

Updated Date - 2022-05-22T06:14:21+05:30 IST