అమరావతి: ఏపీలో పంచాయతీ అకౌంట్లలో నిధులు అదృశ్యమవుతున్నాయి. అకౌంట్లలో సున్నా బ్యాలెన్స్ చూసి సర్పంచులు ఖంగుతిన్నారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు, జనరల్ ఫండ్స్ అకౌంట్లలోని నిధులను ఏపీ ప్రభుత్వం లాగేసుకున్నది. గత రాత్రి ప్రభుత్వం రూ.4 వేల కోట్ల నిధులను లాగేసుకుందని పంచాయతీ సర్పంచుల ఛాంబర్ ఆరోపిస్తున్నది. 12,918 గ్రామ పంచాయితీల్లో నిధులు లాగేసుకున్నారని సర్పంచులు ఆరోపిస్తున్నారు. గతంలో 14, 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.7,600 కోట్లను కూడా.. ప్రభుత్వం ఇలానే లాగేసుకుందని సర్పంచులు గుర్తుచేస్తున్నారు. గ్రామాల్లో వసూలు చేసిన ఆస్తి, ఇంటి, నీటి, డ్రైనేజీ పన్నులను కూడా జనరల్ ఫండ్స్ నుంచి ఏపీ ప్రభుత్వం లాగేసుకున్నది. పంచాయతీ నిధులను ప్రభుత్వం దొంగిలించిందని టీడీపీ నాయకుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. నిధుల గోల్మాల్పై త్వరలోనే ఉద్యమిస్తామని సర్పంచులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి