చామన్‌పెల్లిలో యువకుడి అదృశ్యం

ABN , First Publish Date - 2021-01-21T06:24:34+05:30 IST

మండ లంలోని చామన్‌పెల్లిలో ముండ్ల గంగాధర్‌ (25) అనే యువకుడు కనిపించడం లేదని ఎస్సై యూనిస్‌ అహ్మద్‌ అలీ తెలిపారు.

చామన్‌పెల్లిలో యువకుడి అదృశ్యం
ముండ్ల గంగాధర్‌ (ఫైల్‌)

లక్ష్మణచాంద, జనవరి 20 : మండ లంలోని చామన్‌పెల్లిలో ముండ్ల గంగాధర్‌ (25) అనే యువకుడు కనిపించడం లేదని ఎస్సై యూనిస్‌ అహ్మద్‌ అలీ తెలిపారు. బుధవారం ఆయన తెలిపిన వివ రాల ప్రకారం గత రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయలుదేరిన గంగాధర్‌ తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల ఇండ్లలో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-01-21T06:24:34+05:30 IST