దివ్యాంగుల సంక్షేమానికి కృషి

ABN , First Publish Date - 2020-12-05T03:50:37+05:30 IST

దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ అన్నారు.

దివ్యాంగుల సంక్షేమానికి కృషి
వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఖయ్యూంను సన్మానిస్తున్న చైర్మన్‌

-మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ 

కాగజ్‌నగర్‌, డిసెంబరు4: దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ అన్నారు. శుక్రవారం కాగజ్‌నగర్‌ మెప్మా కార్యాలయంలో దివ్యాంగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా కింద రూ.3000 పెన్షన్‌ ఇస్తోందన్నారు. పలువురు దివ్యాంగులకు సాంకేతిక కారణాలతో పెన్షన్‌ ఆగిపోయినట్లు తన దృష్టికి వచ్చిందని, ఆ సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్‌ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ ఖయ్యూంతో పాటు పలువురిని వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెప్మా డీఎంసీ మోతీరాం, టీఎంసీ ఉషా, కౌన్సిలర్‌ మినాజ్‌, ి నాయకులు రబ్బాని, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T03:50:37+05:30 IST