వజ్రాయుధం దిశ యాప్‌

ABN , First Publish Date - 2021-07-26T05:19:08+05:30 IST

మహిళల చేతిలో వజ్రాయుధం దిశ యాప్‌ అని గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ త్రివిక్రమ్‌వర్మ తెలిపారు.

వజ్రాయుధం దిశ యాప్‌
పోలీసు సిబ్బందికి రివార్డు అందచేస్తున్న డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ

అర్ధరాత్రి మహిళను కాపాడిన పోలీసులు

సిబ్బందిని అభినందించిన డీఐజీ 

రివార్డుల అందజేత


నెల్లూరు(క్రైం), జూలై 25: మహిళల చేతిలో వజ్రాయుధం దిశ యాప్‌ అని గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ త్రివిక్రమ్‌వర్మ తెలిపారు.నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం రాత్రి నాయుడుపేటలో జరిగిన మహిళ సంఘటనను వివరించారు. దిశ యాప్‌ను వినియోగించిన రెండు నిమిషాల  వ్యవధిలో పోలీసులు ఆమె రక్షణ కల్పించారని, దిశ యాప్‌ మహిళల చేతిలో ఉంటే ఎలాంటి రక్షణ కలుగుతుందో ఈ సంఘటన బట్టి అర్థం అవుతుందన్నారు.  ఆమెకు రక్షణ  కల్పించిన సిబ్బందిని డీఐజీ అభినందించి రివార్డులు అందించారు. హోమ్‌గార్డు డీ శ్రీనివాసులు, డీవీ సత్రం ఎన్‌ఆర్‌వో హెడ్‌కానిస్టేబుల్‌ సత్యనారాయణ, దిశ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది ఏఆర్‌ కానిస్టేబుల్‌ నాగబ్రహ్మానందరెడ్డి, బీట్‌  కానిస్టేబుల్‌ హరికృష్ణ, హోంగార్డు షాహుల్‌, ఏఆర్‌ కానిస్టేబుల్‌ సురేష్‌లకు రివార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సీహెచ్‌ విజయరావు, డిఎస్పీలు, ఇన్‌స్పెక్టర్‌లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

                   

కరోనా కేసులు 269

ఒకరు మృతి

నెల్లూరు(వైద్యం) జూలై 25 : జిల్లాలో కరోనా కేసులు కొద్దిగా పెరిగాయి.  ఆదివారం 269 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మృత్యువాత పడ్డారు. అలాగే కరోనా నుంచి కోలుకున్న 179 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.  











Updated Date - 2021-07-26T05:19:08+05:30 IST