Abn logo
Sep 24 2021 @ 01:19AM

లక్ష్యిత ప్రయోజనాలు సమగ్రంగా అందించాలి

సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఎంపీ గీత, పక్కన కలెక్టర్‌ తదితరులు

  • జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎంపీ గీత

కాకినాడ సిటీ, సెప్టెంబరు 23: కేంద్ర ప్రభుత్వ పథకాల కింద జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను లక్ష్యిత ప్రయోజనాలు సమగ్రంగా అందించేలా సమర్థవంతంగా అమలుచేయాలని కాకినాడ పార్లమెంట్‌ సభ్యురాలు, దిశ కమిటీ చైర్‌పర్సన్‌ వంగా గీత అధికారులను కోరారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ వివేకానంద సమావేశ హాల్‌లో దిశ (డిసి్ట్రక్‌ ఇనీషియేటివ్‌,సెల్ఫ్‌ రిలయన్స్‌ అండ్‌ హ్యూమన్‌ అడ్వాన్స్‌మెంట్‌) జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ గీత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌,చంద్రబోస్‌, అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కమిటీ కార్యదర్శి కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయంతో జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాల ప్రగతిని కమిటీ సమీక్షించి సూచనలు చేసింది. ఈ సమావేశంలో జేసీలు చేకూరి కీర్తి, ఎ భార్గవ్‌తేజ, కాకినాడ ఏఎస్పీ కరణం కుమార్‌, రాజమహేంద్రవరం ఏఎస్పీ లతామాధురి, కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌  పుండ్కర్‌, చింతూరు ఐటీడీఏ పీవో ఎ.వెంకటరమణ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు, సీపీవో పి త్రినాథ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.