Sep 17 2021 @ 09:36AM

"ఎవరు మీలో కోటీశ్వరులు": హాట్ సీట్‌లో రాజమౌళి, కొరటాల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ ఎంటర్‌టైంగ్ రియాలిటీ షో "ఎవరు మీలో కోటీశ్వరులు". ఈ షోకి గెస్టులుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి, కొరటాల రాబోతున్నారు. తారక్ ముందు హాట్ సీట్‌లో కూర్చొని ఆడబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను కూడా నిర్వాహకులు వదిలారు. ఈ ప్రోమో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ 20 సోమవారం నాడు ప్రసారం కానుంది. ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్‌లో 'స్టూడెంట్ నంబర్ 1', 'సింహాద్రి', 'యమదొంగ' చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో చరణ్ మరో హీరోగా 'ఆర్ఆర్ఆర్' రాబోతోంది. అలాగే ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో 'జనతా గ్యారేజ్' వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక త్వరలోనే కొరటాల దర్శకత్వంలో 'ఎన్టీఆర్ 30' మొదలవబోతోంది. దాంతో సోమవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో 'ఆర్ఆర్ఆర్', 'ఎన్టీఆర్ 30' చిత్రాలకి సంబంధించి ఎలాంటి విషయాలను పంచుకోబోతున్నారో అనే ఆసక్తి అందరిలోనూ విపరీతంగా పెరుగుతోంది. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 20 వరకు ఆగాల్సిందే.