Abn logo
Aug 5 2020 @ 09:02AM

గురువు బాట‌లో డైరెక్ట‌ర్ తేజ‌..!

డైరెక్ట‌ర్ తేజ త‌న గురువు రామ్‌గోపాల్ వ‌ర్మ బాట‌లో ప‌య‌నించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌ర్మ నిర్మాత‌గా మారి త‌న శిష్యుల‌ను డైరెక్ట‌ర్స్‌గా ప‌రిచ‌యం చేస్తుంటారు. అలా డైరెక్ట‌ర్ తేజ త‌న శిష్యుడి కోసం నిర్మాత‌గా మారుతున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌స్తుతం ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా డిజిట‌ల్ మాధ్య‌మాల వైపు ఆక‌ర్షితుల‌వుతున్నారు. దీంతో మన స్టార్స్‌, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఎక్కువ‌గా డిజిటల్ కంటెంట్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నారు. అందులో భాగంగా డైరెక్ట‌ర్ తేజ ఓ బోల్డ్ కంటెంట్‌తో వెబ్ సినిమాను రూపొందించారు. ఈ వెబ్ సినిమాకు తేజ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తే.. ఆయన ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో వ‌ర్క్ చేసిన రాకేష్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు.  

Advertisement
Advertisement
Advertisement