Abn logo
Jul 9 2020 @ 23:37PM

‘న్యూ’స్‌

మలయాళంలో విజయం సాధించిన ‘కప్పెలా’ చిత్రం రీమేక్‌ హక్కులు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ కొన్న విషయం విదితమే. రోషన్‌ మాథ్యూ, అన్నా బెన్‌ ఇందులో ముఖ్య జంట. తెలుగులో విష్వక్‌ సేన్‌ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. చిత్ర కథ నచ్చి విష్వక్‌ సేన్‌ నటించడానికి ఆసక్తి చూపించినట్లు సమాచారం. ఆగస్టు నెల్లో ‘కప్పెలా’ తెలుగు రీమేక్‌కు సంబంధించిన అన్ని విషయాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 


‘సైరా’ సినిమా తర్వాత దర్శకుడు సురేందర్‌ రెడ్డి చేసే చిత్రం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి మహేశ్‌, ప్రభాస్‌, వరుణ్‌తేజ్‌, రామ్‌.. ఇలా కొంతమంది హీరోలను ఆయన ఎప్రోచ్‌ అయ్యారనీ, అయితే వారంతా ఇతర ప్రాజెక్ట్స్‌తో లాక్‌ అయి ఉండడంతో ఏదీ ఇంకా ఫైనలైజ్‌ కాలేదనీ ఫిల్మ్‌నగర్‌ టాక్‌. తాజాగా అఖిల్‌ అక్కినేనిని కలసి సురేందర్‌ రెడ్డి కథ చెప్పారనీ, అఖిల్‌ చేయడానికి ఆసక్తి చూపించారనీ వార్తలు హల్‌చల్‌ అవుతున్నాయి. అఖిల్‌ నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ విడుదల కోసం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఆ సినిమా రిలీజ్‌ ఎప్పుడని తేలాక అఖిల్‌ కొత్త సినిమా విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 


వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పవన్‌ కల్యాణ్‌ కథతో ‘పవర్‌స్టార్‌’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! దీనికి సంబం ధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను వర్మ సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ‘ఎన్నికల ఫలితాల తర్వాతి కథ’ అని పోస్టర్‌లో ప్రస్తావించారు. ఇద్దరు అన్నదమ్ములు అంటూ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ను పోలి ఉన్న నటుల ఫొటోలను కూడా ఆయన పోస్ట్‌ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement