Abn logo
Mar 29 2020 @ 21:38PM

ప్రియ మిత్రుడిని కోల్పోయిన సుకుమార్

దర్శకుడు సుకుమార్‌కు ప్రియ మిత్రుడు, ‘అమరం అఖిలం ప్రేమ’ చిత్ర నిర్మాతయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ శనివారం మథ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. సుకుమార్ మేనేజర్‌ అయిన ప్రసాద్ మరణ వార్త విన్న సుకుమార్ తన ప్రాణ మిత్రుడిని కోల్పోయానని అన్నారు. 


తన మిత్రుడి మరణం తెలుసుకున్న సుకుమార్ ఎంతో ఆవేదనకు లోనయ్యారు. ఎప్పుడూ నవ్వుతూ, పాజిటివ్ ఎనర్జీతో తను ఉండటమే కాకుండా, ఎదుటి వారికి కూడా ఇచ్చే ప్రసాద్ లేడంటే నమ్మలేకపోతున్నాను. ఆయన మరణం నాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ప్రసాద్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. అని సుకుమార్ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement