Abn logo
Jun 3 2020 @ 13:41PM

పెళ్లిపీటలు ఎక్కనున్న `సాహో` డైరెక్టర్!

`రన్ రాజా రన్` వంటి సూపర్‌హిట్ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేశాడు యంగ్ డైరెక్టర్ సుజిత్. ఆ సినిమా నచ్చడంతో సుజిత్‌కు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ భారీ బాధ్యతలు అప్పగించాడు. `సాహో` సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అయినప్పటికీ సుజిత్ మరో మెగా ఛాన్స్ పట్టేశాడు. 


మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`ను తెలుగులోకి రీమేక్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను సుజిత్‌కే అప్పగించారు. త్వరలో ఈ యంగ్ డైరెక్టర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడట. తను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న ప్రవళ్లిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకరించారని సమాచారం. ఈ నెల పదో తేదీన ఎంగేజ్మెంట్ అని తెలుస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement