Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 05 Aug 2022 20:07:34 IST

Shankar: దర్శకుడు శంకర్‌కు గౌరవ డాక్టరేట్

twitter-iconwatsapp-iconfb-icon

భారీ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు శంకర్ (Shankar). భారతీయ సినీ చిరిత్రలో అతడికీ ప్రత్యేక స్థానం ఉంది. ‘రోబో’, ‘ఐ’, ‘2.O’ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఓ యూనివర్శిటీ శంకర్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


పల్లవరంలోని వేల్స్ విస్టాస్ క్యాంపస్ 12వ వార్షిక స్నాత‌కోత్సావాన్ని ఆగస్టు 5న జరుపుకొంది. ఈ సందర్భంగా విశ్వ విద్యాలయం శంకర్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది. చిత్ర పరిశ్రమకు అతడు అందించిన సేవలను కొనియాడుతూ ఈ డాక్టరేట్‌ డిగ్రీని అందించింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్స్ ఈ పిక్స్ కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. శంకర్‌తో పాటే భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు కూడా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ డిగ్రీని అందించింది. శంకర్ త్వరలోనే ‘ఇండియన్-2’ (Indian 2) షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. గతంలో అతడు తెరకెక్కించిన ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ నటిస్తున్న సినిమాను శంకర్ ఇప్పటికే తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా ‘ఆర్‌సీ-15’ అని పెట్టారు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement