Advertisement

ఈడీ విచారణకు హాజరైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌

హైదరాబాద్: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణ మొదలైంది. మంగళవారం ఈడీ విచారణకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ హాజరయ్యారు. పూరీతో పాటు ఆయన కొడుకు, చార్టెడ్ అకౌంటెంట్ హాజరు అయ్యారు. డ్రగ్స్ కొనుగోలు ఏ రూపంలో జరిగాయని పూరీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఎక్సైజ్ శాఖ రిపోర్టు ఆధారంగా పూరిని నుంచి ఈడీ అధికారులు సమాచారాన్ని రాబడుతున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో విదేశీ పెడ్లర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కోసం పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులను మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే 12 మంది టాలీవుడ్‌ నటులకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘన అభియోగాల కింద నోటీసులు ఇచ్చారు. నేటి నుంచి సెప్టెంబర్ 22 వరకు సినీ ప్రముఖులను ఈడీ విచారించనుంది.

Advertisement