May 15 2021 @ 11:12AM

చిరంజీవి విష‌యంలో ఆ డైరెక్ట‌ర్ జోస్యం నిజ‌మైంది..!

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి త‌న జ‌ర్నీలో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించి మెప్పించారు. చిరంజీవి కెరీర్ ప్రారంభంలోనే ఓ ద‌ర్శ‌కుడు ఆయ‌న్ని గ‌మ‌నించి స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌లా పాపులారిటీ సంపాదించుకుంటావ‌ని జోస్యం చెప్పారు. ఇంత‌కీ ఆ ద‌ర్శ‌కుడెవ‌రు? ఏ సంద‌ర్భంలో అలా చెప్పార‌నే వివ‌రాల్లోకి వెళితే.. దాదాపు 39 ఏళ్ల ముందు క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబుతో చిరంజీవిక‌లిసి ‘బిల్లా రంగా’ అనే సినిమా చేశారు. ఈ చిత్రానికి కె.ఎస్‌.ఆర్‌.దాస్ ద‌ర్శ‌కుడు. సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఓసారి చిరంజీవి చొక్కా మార్చుకుంటూ ఉంటేఅనుకోకుండా అటు వైపు చూసిన ద‌ర్శ‌కుడుకి, చిరు వీపుపై పెద్ద పుట్టు మ‌చ్చ క‌న‌ప‌డింది. అప్పుడాయ‌న ఎన్టీఆర్‌గారిలానే నీకు మ‌చ్చ ఉంది. నీకు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంది. ఆయ‌న‌లా నువ్వు పాపులారిటీ సంపాదించుకుంటావు అని అన్నార‌ట‌. అలా డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ఆర్‌.దాస్ జోస్యం నిజ‌మై..చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. 

ఇవి కూడా చదవండిImage Caption

చిరంజీవి విష‌యంలో ఆ డైరెక్ట‌ర్ జోస్యం నిజ‌మైంది..!