‘గోకులంలో గోవిందుడు’ చిత్రంతో విక్రమ్ దర్శకుడు రీ ఎంట్రీ

అప్పట్లో చియాన్ విక్రమ్‌, ఊహలతో ‘ఊహ’ అనే చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ప్రభాకర్ శివాల.. చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. ‘ఊహ’తో పాటు వడ్డే నవీన్ హీరోగా ‘శ్రీమతి కల్యాణం’ అనే చిత్రానికి కూడా ఆయన దర్శకత్వం వహించారు. ఇప్పుడు రీ ఎంట్రీలో ‘గోకులంలో గోవిందుడు’ అనే క్లాసీ టైటిల్‌తో వచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారు. లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ పతాకంపై వ్యాపారవేత్త పి. ఎన్. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2022 ఫిబ్రవరి ప్రథమార్థంలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Advertisement