Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 19 May 2022 00:00:00 IST

అనుకున్నట్లే పెద్ద హిట్‌ కొట్టాం

twitter-iconwatsapp-iconfb-icon

‘‘సర్కారు వారి పాట’ చిత్రం రిలీజ్‌ రోజు ఉదయమే మహేశ్‌బాబు ఫోన్‌ చేసి, ‘అన్ని చోట్ల నుంచి బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వస్తోంది’ అని కంగ్రాట్స్‌ చెప్పారు. ఈ సినిమా కోసం నేను ఎంత కష్టపడ్డానో మహేశ్‌గారికి తెలుసు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినందుకు ఆనందంగా ఉంది’ అని దర్శకుడు పరశురాం అన్నారు. మహేశ్‌బాబు, కీర్తిసురేష్‌ జంటగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇటీవలె విడుదలై ఘన విజయం సాఽధించింది. ఈ సందర్భంగా పరశురామ్‌ మీడియాతో మాట్లాడారు. 


‘సర్కారు...’ కథ అనుకున్నప్పుడే మహేశ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవ్వాలనుకున్నాం. దానికి తగ్గట్టు ఘన విజయం సాధించింది. దర్శకులు సుకుమార్‌, హరీష్‌శంకర్‌, పూరి జగన్నాథ్‌ తదితరులు ఫోన్‌ చేసి ప్రశంసించారు. ‘మహేశ్‌బాబు గారిని అద్భుతంగా చూపించారు’ అని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు. 


నా మటుకు మహేశ్‌బాబు గారిని డైరెక్ట్‌ చేయడమే పెద్ద కిక్కు. సినిమా మంచి హిట్‌ అందుకున్నందుకు ఆనందంగా ఉంది. రెండో వారంలోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ‘సర్కారు..’కు రిపీట్‌ ఆడియన్స్‌ రావడానికి సినిమాలో ఉన్న వినోదమే కారణం. బ్యాంకు రుణాల ఎగవేత గురించి మేం చెప్పిన పాయింట్‌తో ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యారు. ఇలాంటి కథతో గతంలో సినిమాలు రాకపోవడం కలిసొచ్చింది.  


మహేశ్‌ బయట డాన్స్‌ చేయడం ఇదే తొలిసారి. దీన్ని బట్టే  సినిమా సక్సెస్‌ను ఆయన ఎంత ఎంజాయ్‌ చేస్తున్నారో అర్థమవుతోంది.  కృష్ణ గారికి కూడా సినిమా బాగా నచ్చింది. ఆయన పుట్టిన రోజునాడు వె ళ్లి కలుస్తాను. 


ఈ సినిమాలో కీర్తిసురేష్‌ పాత్ర కీలకం. కథని మలుపు తిప్పే పాత్ర అది. నా గత చిత్రాల్లో కథానాయికలకు ఉన్న ప్రాధాన్యం ఈ సినిమాలోనూ ఉంది. పాత్ర స్వభావం కథానాయిక స్థాయిని, మహిళల గౌరవాన్ని తగ్గించేలా ఉందని నేనయితే అనుకోవడం లేదు. 


కొన్ని కథలు సిద్ధం చేశాను. ముందుగా 14 రీల్స్‌ బ్యానర్‌లో నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేస్తున్నా. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement